వెల్ నెస్ సెంటర్ పేరుతో వ్యభిచారం : ఆరుగురి అరెస్ట్

వెల్ నెస్ సెంటర్ పేరుతో వ్యభిచారం : ఆరుగురి అరెస్ట్

Updated On : March 17, 2021 / 5:53 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు భౌతికదూరం పాటిస్తుంటే, వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా ఆడవాళ్ల శరీరాలతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మరి కొందరు. జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవని వెల్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వెల్ నెస్ సెంటర్ పేరుతో లోకాంటో వెబ్ సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు.

శైలజ తన మొబైల్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో పెట్టి ఫోన్ చేసిన వారికి వివరాలు తెలుపుతోంది. తనకు సాయంగా గద్వాలకు చెందిన చందా వనజశ్రీని  నియమించుకుంది. ఆమె ద్వారా కూడా విటులను ఆకర్షిస్తోంది. ఆమెకు నెలకు రూ.10,000 ఇస్తోంది. మరో వైపు బ్రోకర్ల సాయంతో వీరు ఉత్తరాది రాష్ట్రాలనుంచి మహిళలను తీసుకువచ్చి వారితో వెల్ నెస్ సెంటర్ లో గుట్టుగా  వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనికి భర్త పరమేశ్వరన్ కూడా సహకరిస్తున్నాడు. గత కొంత కాలంగా జరుగుతున్న ఈ హైటెక్ దందాపై పోలీసులకు సమాచారం అందింది.

గురువారం వెల్ నెస్ సెంటర్ పై దాడి చేసి నిర్వాహకురాలు శైలజతో సహా నలుగురు మహిళలను, ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకున్న భర్త పరమేశ్వరన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  విటులు ఆలీ, రాజు రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. వైద్యులు, పోలీసులు  కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు పోరాడుతుంటే ఇలాంటి అక్రమార్కులు  మహిళల శరీరాలతోదర్జాగావ్యాపారం చేస్తుండటం కలవరపెడుతోంది.

Read: ఫేస్ బుక్ లో స్నేహం..నగ్న వీడియోలు..బ్లాక్ మెయిల్