Honour Killing: పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని.. పురుగుల మందు తాగించి.. కన్నకూతురి దారుణ హత్య

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఎంకైర్వీ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది.

Honour Killing: పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని.. పురుగుల మందు తాగించి.. కన్నకూతురి దారుణ హత్య

Updated On : December 25, 2025 / 10:46 PM IST

Honour Killing: కడుపున పుట్టిన పిల్లల కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యమైపోతున్నాయి కొందరు తల్లిదండ్రులకు. పరువు పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు పేరెంట్స్. పరువు కోసం కడుపున పిట్టిన పిల్లలను కూడా చంపుతున్నారు. పిల్లల కన్నా పరువే ముఖ్యం అనుకుంటున్నారు. తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి ప్రాణాలే తీసేస్తున్నారు. పరువు పేరుతో కన్నవారే హత్యలు చేస్తున్నారు.

తాజాగా కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో పరువు హత్య వెలుగు చూసింది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురిని తల్లిదండ్రులే అతి దారుణంగా చంపేశారు. మృతురాలు టెన్త్ క్లాస్ చదువుతోంది. తన గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. కూతురి ప్రేమ వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందని అమ్మాయి తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు.

కన్న కూతురు అని కూడా కనికరం చూపలేదు. చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఆమెతో బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. తమ కూతురు కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు కథను బాగానే నడిపారు. కూతురి మృతిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

గత నెల 14న ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఎంకైర్వీ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్య అని తేల్చారు. తల్లిదండ్రులే కూతురిని హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. పెళ్లైన యువకుడిని ప్రేమించడంతో కుటుంబం పరువు పోతుందని తామే తమ కూతురిని చంపేశామని తల్లిదండ్రులు అంగీకరించారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య..