Hindu Lynched: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య..
మరో హిందూ యువకుడు అల్లరి మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
Hindu Lynched: బంగ్లాదేశ్ లో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. హిందువులు టార్గెట్ గా దారుణాలకు తెగబడుతున్నారు. ఇటీవల దీప్ దాస్ అనే హిందూ యువకుడిని అల్లరి మూకలు అతి కిరాతకంగా చంపేశాయి. ఈ దారుణం మరువక ముందే.. మరో హిందూ యువకుడు అల్లరి మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అమృత్ మండల్ అనే యువకుడిని అల్లరి మూకలు కొట్టి చంపాయి. రాజ్ బరి జిల్లాలో ఈ ఘోరం జరిగింది.
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను మూకదాడి చేసి చంపిన కొన్ని రోజులకే, అమృత్ మండల్ అనే హిందూ వ్యక్తిని కొట్టి చంపడం కలకలం రేపుతోంది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని రాజ్‌బారి జిల్లా పాంగ్షా ఉప జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుడు ఒక బెదిరింపుల కేసులో నిందితుడని పోలీసులు చెప్పినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
స్థానిక మీడియా ప్రకారం, డిసెంబర్ 24న రాత్రి 11 గంటల ప్రాంతంలో కాలిమోహర్ యూనియన్‌లోని హోసెన్‌డంగా గ్రామంలో ఈ నేరం జరిగిందని పాంగ్షా సర్కిల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవ్రత సర్కార్ తెలిపారు. పోలీసులు అమృత్ సహచరుడైన మహమ్మద్ సెలిమ్‌ను అరెస్ట్ చేశారు. అతని నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Also Read: బంగ్లాదేశ్ డార్క్ ప్రిన్స్ తారిక్ రహమాన్ తిరిగి వచ్చేశారు.. ఇది భారత్‌కు ఎందుకు శుభవార్త?
