Madhya Pradesh: మూడు ట్రక్కులు ఢీ.. చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి

శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రౌ-ఖల్ఘాట్ నాలుగు లేన్ల రహదారిపై, గణ్‌పతి ఘాట్ వద్ద మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ట్రక్కులు అతివేగం కారణంగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలు బోల్తాపడ్డాయి.

Madhya Pradesh: మూడు ట్రక్కులు ఢీ.. చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి

Updated On : March 11, 2023 / 7:29 PM IST

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రౌ-ఖల్ఘాట్ నాలుగు లేన్ల రహదారిపై, గణ్‌పతి ఘాట్ వద్ద మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Goa Forest Fire: గోవాలో దావానలం.. తగలబడుతున్న అడవులు.. ప్రధాని మోదీ సమీక్ష

ట్రక్కులు అతివేగం కారణంగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలు బోల్తాపడ్డాయి. వాహనాలు ఢీకొని, పడిన తర్వాత వాటి నుంచి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆ మంటల ప్రభావంతో ఇద్దరు మరణించారు. ఒక ట్రక్కు డ్రైవర్, మరో సహాయకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. మృతదేహల్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కోసం తరలించారు.

క్షతగాత్రుల్ని ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తర్వాత పోలీసులు వాహనాలను తొలగించి, పరిస్థితి చక్కదిద్దారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.