గర్భిణిపై భర్త, అత్త అరాచకం : కడుపుపై తన్నిన అత్త

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 07:52 AM IST
గర్భిణిపై భర్త, అత్త అరాచకం : కడుపుపై తన్నిన అత్త

విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తలు చిత్ర హింసలు పెడుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి కడుపుపై తన్నారని, గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు వాపోయింది. పాతికలక్షల రూపాయలు తీసుకువస్తేనే పిల్లల్ని కనమని భర్త, అత్త బెదిరిస్తున్నారని భాదితురాలు చెబుతోంది. చున్నీతో గొంతు నులిమి చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపింది. కడుపు నొప్పి తీవ్రం కావడంతో సోదరుడి సాయంతో కేజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతోంది బాధితురాలు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.