భార్య పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన భర్త షాక్….

  • Published By: chvmurthy ,Published On : April 15, 2020 / 10:11 AM IST
భార్య పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన భర్త షాక్….

Updated On : April 15, 2020 / 10:11 AM IST

మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ  వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది.

వరంగల్ కి చెందిన యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ వచ్చింది. తన స్నేహితురాలి ద్వారా ఉద్యోగం సంపాదించుకునే క్రమంలో  లేడీస్ హాస్టల్ లో చేరి ప్రయత్నాలు మొదలెట్టింది.  నెల రోజులు దాటినా  ఎక్కడా  ఉద్యోగం దొరక్కపోవటంతో నిరాశకు గురైంది.

అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ సమయంలో తాను ఉంటున్న హాస్టల్ పక్కనే ఉన్న ఆంటీ తోపరిచయం ఏర్పడింది. ఒకానొక రోజు  ఇంత చదువుకున్నా ఉద్యోగం దొరకలేదని ఆ యువతి ఆంటీ ముందు వాపోయింది.  

ఇంత అందంగా ఉన్నావు. నీకు ఉద్యోగం ఎందుకు నీ అందాన్ని ఎరవేయ్… అంటూ ఆంటీ ఆయువతికి సలహా ఇచ్చింది.  నెల దాటినా ఉద్యోగం దొరక్కపోవటంతో నిరాశలో ఉన్న యువతికి ఆంటీ చెప్పిన సలహా ఆలోచనలో పడేసింది. చివరికి ఆంటీ చెప్పినట్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసి వారితో సన్నిహితంగా మెలగటం మొదలెట్టింది.  
 

ఈలోగా ఇంటి దగ్గర పేరెంట్స్  యువతికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. వాటిలో  అమెరికాలో ఉద్యోగం చేసే ఒక వరుడి సంబంధం కుదిరింది. అందం, చదువు అన్నీ ఉండేసరికి త్వరగానే పెళ్లి కుదిరింది. పెళ్లి అయ్యాక  భర్తతో కలిసి అమెరికాకువె ళ్లిపోయింది ఆయువతి.

కొన్నాళ్లు వీరి కాపురం బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకున్నవ్యక్తికి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది.  అలా చూస్తుండగా ఒకరోజు భార్య పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉన్న  పోర్న్ వీడియో చూశాడు. షాక్ కు గురయ్యాడు. 

కోపంతో ఇంటికి వచ్చి భార్యతో  గొడవపడ్డాడు. ఇంక అప్పటినుంచి భార్యను హింసించటం మొదలెట్టాడు. భర్త  హింస భరించలేని భార్య  పోలీసులను ఆశ్రయించింది.  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  అయితే ఆయువతి భారత్ తిరిగి రావాలనే సరికి ప్రస్తుతం కరోనా కారణంగా విమాన సర్వీసులు బంద్ అవటంతో అమెరికాలోనే  తెలిసిన వారి ఇంట్లో ఆశ్రయం పొందింది.

భర్త పెట్టే హింసలను సెల్పీ వీడియో తీసి వరంగల్ లోని కుటుంబ సభ్యులకు పంపించింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే భారత్ వచ్చేస్తానని ఆ సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఒంటరిగా ఉన్న మహిళలు,  ఆడపిల్లలను ట్రాప్ చేసి వ్యభిచార వృత్తిలోకి దింపే వాళ్లు సమాజంలో ఉన్నంత వరకు ఆడపిల్లలకు ఎక్కడున్నా రక్షణ ఉండదు. అందుకే ఆడపిల్లలు అపరిచిత మహిళలతోనూ జాగ్రత్తగా మెలగండి.