వెలుగులోకి గంజాయి గ్యాంగ్ ఘోరాలు : అమ్మాయిలను మత్తులోకి దించి అత్యాచారాలు

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 07:24 AM IST
వెలుగులోకి గంజాయి గ్యాంగ్ ఘోరాలు : అమ్మాయిలను మత్తులోకి దించి అత్యాచారాలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గంజాయి గ్యాంగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతీ యువకులు కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి దందా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడినట్టు ఆధారాలు సేకరించారు. ఈ గ్యాంగ్ లో నాను అలియాస్ నరేష్, బాబా అలియాస్ అభిరామ్ కీలకం. వీరిద్దరు కలిసి ముఠా ఏర్పాటు చేశారని,  11 మందిని తమలో కలుపుకున్నారని పోలీసులు చెప్పారు. ఇద్దరు అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి వారిని కూడా తమ ముఠాలో చేర్చుకున్నారని పోలీసులు తెలిపారు. వీరంతా కలిసి గంజాయి సేవించడం, అమ్మడం చేసేవారని అన్నారు. నాను తండ్రి కారుడ్రైవర్ కాగా, అభిరామ్ తండ్రి ల్యాబ్ టెక్నీషియన్.

అభిరామ్, నాను ముందుగా ఇద్దరు అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని మత్తులో ఉంచి వారిపై పలుమార్లు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వాటిని వీడియోలు తీసి బెదిరించి తమ ముఠాలో సభ్యులుగా మార్చుకున్నారు. తాము చేసే మోసాలకు వారిని కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. వీరికి అలీ అనే వ్యక్తి గంజాయి సప్లై చేసేవాడు. ముఠా అలీని కూడా బెదిరించి 18వేలు వసూలు చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది.

తమ ముఠాలో ఉన్న ఇద్దరికి పోలీసు వేషం వేయించి.. అలీని భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. నిజం తెలుసుకున్న అలీ.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్టు కేసు పెట్టాడు. దీంతో అభిరామ్ తండ్రి తనకు పరిచయం ఉన్న కార్పొరేటర్ ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. కేసు మాఫీ చేయించాడు.

ట్యాంక్ బండ్‌లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన సంచలనం రేపింది. గంజాయి మత్తులో ఓ బాలుడు బాలికపై అత్యాచారం చేయగా ఆ దృశ్యాలను అతడి స్నేహితులు మొబైల్ లో చిత్రీకరించి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను స్నేహితులకు షేర్ చేశారు. బ్లేడ్‌తో ఆమె ఒళ్లంతా గాయాలు చేశాడు. జననాంగంపైనా దాడి చేసి పైశాచిక ఆనందం పొందాడు. రక్తం కారుతున్నా, గాయాల బాధతో బాలిక ఆర్తనాదాలు చేస్తున్నా ఆ నీచుడు కనికరించలేదు.