నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ

  • Published By: madhu ,Published On : April 26, 2019 / 03:58 AM IST
నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ

Updated On : April 26, 2019 / 3:58 AM IST

హైదరాబాద్‌లో ఓ నకిలీ ఏజెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కూతురును తీసుకెళ్లిన నకిలీ ఏజెంట్లు తమను మోసం చేశారని..దోహాలో ఉన్న కుమార్తెను క్షేమంగా తీసుకొచ్చే విధంగా చూడాలని బాధిత కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు వారు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 
Also Read : మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్…స్టే విధించిన క్యాట్

పాతబస్తీ కుర్మగూడకు చెందిన సయిదా మరియంకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి..ఖతార్ తీసుకెళ్లారు ఇద్దరు ఏజెంట్లు. దోహాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని వారు చెప్పడం జరిగిందని లేఖలో తెలిపారు. ఇందుకోసం లక్షల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత హౌజ్ మేడ్ రిక్రూట్ మెంట్‌ వద్ద రూ. 2 లక్షలు తీసుకుని సయిదా మరియంను నకిలీ ఏజెంట్లు అమ్మేశారని చెప్పారు.

తమకు సహాయం చేయాలని బాధిత కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కూతురు సయిదా మరియంను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. ఫాతిమా జర్నలిస్టుగా పరిచయం చేసుకొని తమను వలలో వేసుకుందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
Also Read : రాహుల్‌కి తప్పిన ప్రమాదం : ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లం