హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టును రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 28 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నటుడు కావాలనుకొని, డీజే గాను, పబ్ లలో పనిచేసిన వ్యక్తి చివరికి డ్రగ్స్ అమ్మి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
హైదరాబాద్ కామాటీపురకు చెందిన ఇసాక్ సినిమాపై ఆసక్తితో ముంబయికి గత మూడేళ్ల కిందట ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లాడు. సినిమాలో యాక్టింగ్ లో అవకాశాలు రాకపోవడంతో డ్రగ్స్ ముఠాతో స్నేహం ఏర్పర్చుకున్నాడు. ఈ ముఠా హెరాయిన్ ను పాతబస్తీ యువతకు విక్రయిస్తున్నారు. ఏడాది కాలంగా వీలును బట్టి సీజన్ కు తగ్గట్లు డిమాండ్ ను బట్టి ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోందని నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ముఠాలోని ఇషాక్ ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకుని వస్తే మిగిలిని వారు వీటిని యూత్ కు అమ్మేవారని ఆయన వివరించారు. విశ్వసనీయ సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకున్నారని పోలీసు కమీషనర్ చెప్పారు. ప్రధాన నిందితుడు ఇషాక్ ను పోలిసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న ముంబయికి చెందిన గ్యాంగ్ మెయిన్ లీడర్ ఉస్మాన్ పరారయ్యాడు.