దేవుడా : పెళ్లి చేయడం లేదని సాఫ్ట్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడి

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 04:03 PM IST
దేవుడా : పెళ్లి చేయడం లేదని సాఫ్ట్ ఇంజినీర్ ఆత్మహత్య

Updated On : February 12, 2020 / 4:03 PM IST

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడి

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. ఉప్పల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు నిఖిల్ గౌడ్. వయసు 24. రామాంత్‌ పూ‌ర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ఉప్పల్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నిఖిల్ అక్కకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అప్పటి నుంచి తనకు కూడా పెళ్లి చేయాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అయితే నిఖిల్ వయసు ప్రస్తుతం 24 ఏళ్లే. దీంతో తల్లిదండ్రులు.. నీకు అప్పుడే పెళ్లెందుకు.. మరికొన్నేళ్లు ఆగాలని నిఖిల్ కు సూచించారు. తల్లిదండ్రుల మాటలు అర్థం చేసుకోలేకపోయిన నిఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తల్లిదండ్రులు ఏదో పనిమీద బయటకు వెళ్లారు. వాళ్లు తిరిగి వచ్చేసరికే … నిఖిల్ విగతజీవిగా కనిపించాడు. ఇంట్లోనే సీలింగ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు సీలింగ్‌కు వేలాడుతున్న నిఖిల్‌ను చూసి షాక్ తిన్నారు. వెంటనే కిందకు దించి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిఖిల్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిఖిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిఖిల్ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని.. ల్యాక్ కు పంపారు. పెళ్లి ఆలస్యం అవుతున్నందునే.. నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తెలిసింది. విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

కేవలం పెళ్లి చేయడం లేదనే కారణంతో.. నిఖిల్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కుటుంబసభ్యులనే కాదు స్థానికులను కూడా విస్మయానికి గురి చేసింది. ఎంతో భవిష్యత్తున్న కుర్రాడు.. ఇలాంటి పిచ్చి పని చేశాడేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని కొందరు…పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు.. టీచరో, తల్లిదండ్రులో తిట్టారని ఇంకొందరు.. ప్రాణం తీసుకుంటున్నారు. పెళ్లి చేయడం లేదనే కారణంతో నిఖిల్ సూసైడ్ చేసుకున్నాడు. ఇలా.. చిన్న చిన్న కారణాలకే.. అర్థం లేని విషయాలకే యువత ప్రాణం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల వ్యవహారంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన చెబుతుంది.