ఫ్రెండ్స్ కోసం 3,200 వయగ్రా పిల్స్.. అడ్డంగా బుక్కయ్యాడు!

Chicago airport with 3,200 Viagra pills : ఫ్రెండ్స్ కోసం వయాగ్రా పిల్స్ తీసుకెళ్తున్న యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3,200 వయగ్రా పిల్స్ చికాగో ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కాడో భారతీయ యువకుడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించారు. వయగ్రా పిల్స్ తన స్నేహితుల కోసం తీసుకెళ్తున్నట్టుగా బయటపెట్టాడు. నాలుగున్నర కేజీల బరువున్న 3,200 వయగ్రా పిల్స్ విలువ రూ.69 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
వయగ్రా పిల్స్ ఎందుకు తీసుకెళ్తున్నాడు అనే విషయంలో అధికారులకు వివరణ ఇవ్వలేకపోయాడు. దాంతో అమెరికా చట్టాల ప్రకారం.. యూఎస్ బయట కొనుగోలు చేసిన మెడిసిన్‌ను దిగుమతి చేయడం నేరమని ఫుడ్ అండ్ డ్రగ్ అధికారులు వెల్లడించారు. నిందితుడి నుంచి వయగ్రా పిల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. అతడి వివరాలను బహిర్గతం చేయలేదు.