అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

విజయవాడ: భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దొంగతనాలు చేసే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ విజయరావు చెప్పారు. నిందితుల నుంచి 10 కార్లు, 3ద్విచక్రవాహానాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోని దిండిగా ప్రాంతానికి చెందిన పెరుముల్ అనే వ్యక్తితో పాటు మరో 4 గురు ముఠాగా ఏర్పడి ఈదొంగతనాలకు పాల్పడుతున్నారని డీసీపీ చెప్పారు. చోరీ చేసిన వాహనాలను చెన్నైలో అద్దెకు తిప్పేందుకు నిందితులు ప్లాన్ చేశారని ఆయన వివరించారు.
నిందితులందరు పలు కేసులలో పాత నేరస్థులే నని..నిందితుల నుండి రూ 20 లక్షల విలువ చేసే వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ముఠా సభ్యులు మొదట రెక్కీ నిర్వహించి..తర్వాత చోరీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మారు తాళాలు ఉపయోగించి వాహనాల చోరీలకు పాల్పడుతున్నారని డీసీపీ విజయరావు తెలిపారు.