Paleru : ఖమ్మం జిల్లా పాలేరులో రూ.3.5 కోట్లు పట్టివేత.. ఈ డబ్బు ఎవరిదంటే?

ఐటీ, ఈసీ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు శ్రీరామ్ నగర్ లో తెల్లవారుజామున అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

Paleru : ఖమ్మం జిల్లా పాలేరులో రూ.3.5 కోట్లు పట్టివేత.. ఈ డబ్బు ఎవరిదంటే?

cash siezed

Paleru Cash seized : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది.  అధికారుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 3.5 కోట్ల రూపాయలు పట్టుబడింది. కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన డబ్బుగా అధికారులు చెబుతున్నారు.

ఐటీ, ఈసీ ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు శ్రీరామ్ నగర్ లో తెల్లవారుజామున రూ. 3.50 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Sampath Kumar : అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ దాడులు

మరోవైపు నారాయణపేట జిల్లాలో ఐటీ దాడులు జరిగాయి. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అనుచరులు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 10 మంది బృందంతో నారాయణపేటలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ లో డబ్బులు పంచుతున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ డివిజన్ లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బు పంచుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి వద్ద 3.5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది.

పీఎస్ఆర్ సెంటర్లో ఎలాంటి అనుమతులు లేకుండా కారులో తరలిస్తున్న 9,00,3500 రూపాయలను పట్టణ పోలీసులు సీజ్ చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం విఠల్ వాడికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 96 సీసాల క్వాటర్ బాటిళ్లు, ఒక బైక్ సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

పెద్దపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

పెద్దపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని ఎన్టీపీసీ కృష్ణా నగర్ ఎలక్షన్ టీమ్ ఓ ఇంట్లో 2 కోట్ల 18లక్షల 90 వేల నగదును స్వాధీనం చేసుకుంది. అధికారులు ఇంటి తలుపులు పగులగొట్టి డబ్బును స్వాధీనం చేసుకున్నారు.