జియో లైఫ్ ఫోన్ పేలిందా..?
దీపావళి పటాసులైనా పేల్తాయో లేదో తెలియదు కానీ తక్కువ ధరకే వస్తుందని ఎగేసుకుంటూ వెళ్ళి కొన్నామే ఆ రిలయన్స్ జియో ఫోన్ లు ఇప్పుడు పటాసుల కంటే వేగంగా పేలుతున్నాయట..
దీపావళి పటాసులైనా పేల్తాయో లేదో తెలియదు కానీ తక్కువ ధరకే వస్తుందని ఎగేసుకుంటూ వెళ్ళి కొన్నామే ఆ రిలయన్స్ జియో ఫోన్ లు ఇప్పుడు పటాసుల కంటే వేగంగా పేలుతున్నాయట..
దీపావళి పటాసులైనా పేల్తాయో లేదో తెలియదు కానీ తక్కువ ధరకే వస్తుందని ఎగేసుకుంటూ వెళ్ళి కొన్నామే ఆ రిలయన్స్ జియో ఫోన్ లు ఇప్పుడు పటాసుల కంటే వేగంగా పేలుతున్నాయట.. వచ్చిన కొద్ది కాలంలొనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలినట్లు వస్తున్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఫోన్లలో మంటలు రావడం, పేలిపోవడం లాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. వరస పేలుళ్లతో యాజమాన్యాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ ఫోన్ పేలుడుకు సంబంధించి ఫొటోను ట్వీట్ చేసిన సదరు నెటిజన్… తర్వాత దానిని డిలీట్ చేశారట. ఈ పేలుడులో ఫోన్ వెనుక భాగం పూర్తిగా పాడైపోగా ముందు భాగం మాత్రం చెక్కు చెదరనట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పేలుడు తర్వాత కూడా బ్యాటరీ పనిచేస్తున్నట్లు ఈ ఫోన్‌ను చెక్ చేసిన లైఫ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.
ఈ ఘటనపై రిలయన్స్ వెంటనే స్పందించి ఎంక్వైరీ ప్రారంభించింది. రిలయన్స్ జియో లైఫ్ ఫోన్లు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగి ప్రపంచంలోనే అత్యుత్తమ హ్యాండ్ సెట్స్ డిజైన్ చేసే సంస్థల నుంచి తయారు చేసారని.. ప్రతీ ఫోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాకే ప్యాక్ చేస్తామని రిలయన్స్ అధికారి చెప్పినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. ‘‘జియో ఫోన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తయారు చేయించాం. ప్రతి ఫోన్‌ను క్వాలిటీ టెస్ట్ చేయించాం. పేలుడు ఘటన మా దృష్టికి వచ్చింది. అయితే అది కావాలనే చేసినట్లు మా విచారణలో తేలింది. జియో బ్రాండ్‌ను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ పని చేశారు’’ అని తెలిపారు. నెల రోజులుగా 60 లక్షల మందికి పైగా కస్టమర్లకు జియో ఫోన్లను రిలయెన్స్ అందిస్తోంది. మా వరకు ఇలాంటి పుకార్లు అయితే రాలేదంటున్నారు జియో సంస్థ అధికారులు.