Journalist Soumya Vishwanathan : జర్నలిస్ట్ సౌమ్య హత్యకేసు.. 15ఏళ్ల తర్వాత నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష
Journalist Soumya Vishwanathan : జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో 15ఏళ్ల తర్వాత నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 సెప్టెంబరు 30న 25ఏళ్ల సౌమ్యా విశ్వనాథ్ దారుణహత్యకు గురయ్యారు.

Journalist Soumya Vishwanathan death row, all four accused awarded life sentence
Journalist Soumya Vishwanathan : దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత నలుగురు దోషులకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఐదో దోషికి ఇప్పటికే జైలు శిక్ష పడింది.
దోషులకు మరణశిక్ష విధించలేం : ఢిల్లీ కోర్టు
మరో నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్, అజయ్ కుమార్‌లకు కూడా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఒక్కొక్కరికి రూ.25వేలు, రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే, ఐదో దోషి అజయ్ సేథీకి రూ.7.5 లక్షల జరిమానా విధించింది.
నలుగురు దోషులకు విధించిన జరిమానాలో రూ.1.2 లక్షలను సౌమ్య విశ్వనాథన్ తల్లిదండ్రులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అజయ్ సేథీ చెల్లించాల్సిన రూ.7.5 లక్షలలో రూ. 7.2 లక్షలు కుటుంబానికి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందకు రాదని, అందువల్ల మరణశిక్ష విధించలేమని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉత్తర్వుల్లో.. ‘యువ, డైనమిక్ జర్నలిస్టు అయిన సౌమ్య ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. భారత్‌లో మహిళా పని భాగస్వామ్య రేటు తగ్గడానికి కారణాలలో ఇదొకటి. మహిళలు పనికి వెళ్లేటప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు దుర్వినియోగం, దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
నాటు తుఫాకీతో కాల్చిచంపిన దుండగులు :
ఇండియా టుడే గ్రూప్‌లో జర్నలిస్ట్ అయిన సౌమ్యా విశ్వనాథన్, సెప్టెంబర్ 30, 2008 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌లో దారుణహత్యకు గురయ్యారు. ఆమె విధుల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు నాటు తుఫాకీతో కాల్చి చంపారు. దీనికి చోరీయే కారణమని పోలీసులు పేర్కొన్నారు. అక్టోబరు 18న కోర్టు మొత్తం ఐదుగురు నిందితులపై హత్యానేరం కింద దోషులుగా నిర్ధారించింది.

Journalist Soumya Vishwanathan death
ఎమ్‌సీఓసీఏ నిబంధనల ప్రకారం.. వ్యక్తి మరణానికి కారణమైన వ్యవస్థీకృత నేరానికి దోషులుగా పరిగణించడం జరుగుతుంది. ఆయా నేరాలకు గరిష్ట శిక్షగా మరణశిక్ష విధిస్తారు. అజయ్ సేథీ కూడా సెక్షన్ 411 ఎమ్‌సీఓసీఏ నిబంధనల ప్రకారం.. వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం లేదా సహకరించడం, నిజాయితీ లేకుండా దొంగిలించిన ఆస్తిని పొందడానికి కుట్ర పన్నినందుకు దోషిగా కోర్టు నిర్ధారించింది.
ఫోరెన్సిక్ నివేదికలో హత్యగా నిర్ధారణ :
ప్రాసిక్యూషన్ ప్రకారం.. బాధితురాలి కారును దొంగిలించడానికి వెంబడిస్తున్నప్పుడు నెల్సన్ మండేలా మార్గ్‌లో నిందితుడు కపూర్ కంట్రీ మేడ్ పిస్టల్‌తో విశ్వనాథన్‌ను అత్యంత దారుణంగా కాల్చి చంపాడు. ఈ నేరానికి పాల్పడిన వారిలో కపూర్‌తో పాటు శుక్లా, కుమార్, మాలిక్ కూడా ఉన్నారు. పోలీసుల విచారణలో జర్నలిస్ట్ సౌమ్య మరణానికి మొదట కారు ప్రమాదమని భావించారు. కానీ, ఫోరెన్సిక్ నివేదికల్లో తలపై తుపాకీతో కాల్చడం కారణంగానే ఆమె మృతిచెందినట్టు తేలింది. కాగా, తుపాకితో కాల్చి అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. ఆమె మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
Read Also : Narendra Modi: చెప్పింది చేసి తీరుతాం.. బీజేపీ హామీలపై ప్రధాని మోదీ