Narendra Modi: చెప్పింది చేసి తీరుతాం.. బీజేపీ హామీలపై ప్రధాని మోదీ

నేను తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల్లో ఎన్నో ఆశ‌లు క‌నిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌జల్లో అన్యాయానికి గుర‌య్యామనే భాద క‌నిపిస్తోంది. వారంద‌రు మార్పు కోరుకుంటున్నారు

Narendra Modi: చెప్పింది చేసి తీరుతాం.. బీజేపీ హామీలపై ప్రధాని మోదీ

చెప్పింది చేసి తీరుతామని, అలాగే చేసేదే చెప్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నా కుటుంబ సభ్యులరా అంటూ ప్రసంగం మొదలుపెట్టిన మోదీ.. క్రమంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై దాడి ప్రారంభించారు.

‘‘తెలంగాణలో ప‌సుపు బోర్డు ఏర్పాటు హమీ ఇచ్చాం. అది కూడా ఏర్పాటు చేసి చూపించాం. ఆయోద్య రామ మందిరం హ‌మీ ఇచ్చాం, మందిరం నిర్మిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు హామీ నెరవేర్చుకున్నాం. ఆర్టికల్ 370డీని రద్దు చేశాం. త్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం. అలాగే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. మేము ఏం చేస్తామో అదే చెప్తాం. ఏది చెప్తామో దాన్ని నిజం చేసి చూపిస్తాం. మిగతా పార్టీలలా హామీలు ఇచ్చి వదిలేయము’’ అని కామారెడ్డి సభలో మోదీ అన్నారు.

‘‘నేను తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల్లో ఎన్నో ఆశ‌లు క‌నిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్క‌డి ప్ర‌జల్లో అన్యాయానికి గుర‌య్యామనే భాద క‌నిపిస్తోంది. వారంద‌రు మార్పు కోరుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. దేశంలో, తెలంగాణలో బీజేపీ గాలీ వీస్తోంది. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా కమలమే అధికారంలోకి వస్తుంది’’ అని మోదీ అన్నారు.