వీడు మామూలోడు కాదు…..పోలీస్ కమీషనర్ పేరు,పోటోతో ట్రూ కాలర్, వాట్సప్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు

వీడు మామూలోడు కాదు…..పోలీస్ కమీషనర్ పేరు,పోటోతో ట్రూ కాలర్, వాట్సప్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు

Updated On : February 6, 2021 / 11:58 AM IST

Kerala : Welding worker poses as City Police Commissioner Arrested  : పోలీసు కమీషనర్ పేరుతో వాట్సప్ ఎకౌంట్ క్రియేట్ చేసి ప్రజలను బెదిరిస్తున్న వెల్డర్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంగనూర్ లో నివసించే అమల్ జిత్ (29) అనే వెల్డింగ్ కార్మికుడు తిరువనంతపురం నగర పోలీసు కమీషనర్ పేరుతో ఒక వాట్సప్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు. ప్రోఫైల్ పిక్చర్ గా తిరువనంతపురం పోలీసు కమీషనరేట్ లోగోను, ఫోటోను ఉంచాడు.

దాన్ని ఎవరైనా చెక్ చేస్తే దొరకకుండా ఉండేందుకు ట్రూకాలర్ లో తన నెంబరుకు పోలీసు కమీషనర్ పేరు పెట్టి సేవ్ చేశాడు.  దాంతో ఎవరూ ఫోన్ చేసినా పోలీసు కమీషనర్ పేరు వచ్చేలా కనపడుతోంది. ఇంకేముంది  తన వాట్సప్ నుంచి కొంతమందికి మెసేజ్ లు పంపించి బెదిరించటం మొదలెట్టాడు.

సైబర్ సెల్ ద్వారా మీ నెంబర్ ను పర్యవేక్షిస్తున్నామని వారిని హెచ్చరిస్తూ మెసేజ్ లు పంపించాడు.. వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆ నెంబర్ ను పరిశీలించిన పోలీసులు నిందితుడి పై నిఘా పెట్టారు. గురువారం ఫిబ్రవరి 4న  సిటీ సైబర్ క్రై్మ్ పోలీసులు అమల్ జిత్ ను అరెస్ట్ చేసి వింజింజం పోలీసు స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ ఐజీ, తిరువనంతపురం నగర పోలీసు కమీషనర్ బలరామ్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు.