నిర్భయ కేసు : ఆ ముగ్గురిని ఉరితీయొచ్చన్న కేంద్రం
ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.
ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. దోషులందరూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని కోరుతూ ఢిల్లీ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది.
పెండింగ్ లో నిర్భయ దోషి వినయ్ మెర్సీ పిటిషన్
ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. నిర్భయ దోషుల్లో వినయ్ మినహా ముగ్గురిని ఉరితీయొచ్చన్న కేంద్రం.. నలుగురిని కలిపి ఒకేసారి ఉరితీయాలన్న నిబంధనేమీ లేదని తెలిపింది. మరోవైపు రాష్ట్రపతి వద్ద నిర్భయ దోషి వినయ్ మెర్సీ పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
ఉరికి తీహార్ జైల్లో ముమ్మర ఏర్పాట్లు
నిర్భయ దోషులను ఉరి తీయడానికి ఇంకా ఒక్కరోజే గడువు ఉంది. ఓవైపు తీహార్ జైల్లో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు శిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషుల ప్రయత్నాలూ కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.
పవన్ గుప్తా మళ్లీ రివ్యూ పిటిషన్
నిర్భయ అత్యాచార ఘటన సమయంలో తాను మైనర్ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని కోరుతూ పవన్ గుప్తా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పవన్ గుప్తా ఇవాళ మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.
ఉరిశిక్ష అమలు వాయిదాకు దోషులు అనేక యత్నాలు
ఈ సందర్భంగా ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో శిక్ష అమలును వాయిదా వేయించేందుకు దోషులు అనేక యత్నాలు చేస్తున్నారు.