Kolkata : కీచక టీచర్-ప్రైవేట్ క్లాస్ పేరుతో విద్యార్ధినిపై లైంగిక దాడి

హౌరాకు చెందిన విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి   కోల్‌కతా‌లోని  యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాలలోకి .... వెళితే ప్రియేష్

Kolkata : కీచక టీచర్-ప్రైవేట్ క్లాస్ పేరుతో విద్యార్ధినిపై లైంగిక దాడి

Kolkata Lecturer

Updated On : April 3, 2022 / 3:06 PM IST

Kolkata : హౌరాకు చెందిన విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి   కోల్‌కతా‌లోని  యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాలలోకి …. వెళితే ప్రియేష్ సింగ్ అనే ఉపాధ్యాయుడు సెంగార్ ఇనిస్టిట్యూట్ లో జాగ్రఫీ బోధించేవాడు.

గత డిసెంబర్ లో ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకునే నెపంతే బాధిత విద్యార్ధినిని సాల్ట్ లేక్ గెస్ట్ హౌస్‌కు   పిలిపించాడు. అక్కడ ఆమెను మాయమాటలతో   లోబరుచుకుని ఆమెపై లైంగికదాడి చేశాడు. అదంతా సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.  అనంతరం ఆవిద్యార్ధిని ఇంటికివెళ్లిపోయింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి తనను కలవడానికి గ్వాలియర్ రావాలని కోరగా అందుకు విద్యార్ధిని తిరస్కరించింది. దీంతో అతడు ఆమెను బెదిరించటం మొదలెట్టాడు.  సాల్ట్ లేక్ గెస్ట్ హౌస్‌లో  తీసిన  ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. లేదా రూ. 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
Also Read : Pak National Assembly : ఇమ్రాన్ ఖాన్ గూగ్లీ .. జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షులు
దీంతో ఆ విద్యార్ధిని ఫిబ్రవరి 15న కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని యూపీఎస్సీ ఉపాధ్యాయుడి కోసం గాలించిన పోలీసులు ఇటీవల మధ్య ప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కొల్‌కతా తీసుకువచ్చిసాల్ట్ లేక్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.