Lakshadweep MP: మర్డర్ అటెంప్ట్ కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్‌కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్‌లోని కవరత్తి కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ కేసులో 23 మంది నిందితుల్లో నలుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు.. ఫైజల్ సహా మరో ముగ్గురి బెయిల్‌ను సస్పెండ్ చేసింది.
Lakshadweep MP sentenced to 10 years in prison in attempt to murder case
Lakshadweep MP: 2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్‌కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్‌లోని కవరత్తి కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ కేసులో 23 మంది నిందితుల్లో నలుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు.. ఫైజల్ సహా మరో ముగ్గురి బెయిల్‌ను సస్పెండ్ చేసింది. తన బంధువు మహ్మద్ సలీపై 2009లో ఫైజల్ దాడికి పాల్పడ్డాడు.
షెడ్ నిర్మాణంపై జరిగిన వాగ్వాదంతో సలీహ్‌పై కొంత మంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ బృందం ఫైజల్ నాయకత్వంలో ఏర్పడిందని కోర్టు ముందు రుజువైంది. కాగా, ఆనాటి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సలీహ్ను కేరళకు తరలించారు, అక్కడ అతను నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఇక ఈ కేసులో ఫైజల్‌కు శిక్ష విధించిన కవరత్తి కోర్లు.. నేరారోపణకు వ్యతిరేకంగా లక్షద్వీప్‌పై అధికార పరిధిని కలిగి ఉన్న కేరళ హైకోర్టును ఆశ్రయించ వచ్చని, చట్టసభ సభ్యునిగా తన అనర్హతను నిరోధించడానికి స్టే పొందేందుకు అక్కడ మాత్రమే అప్పీల్ చేసుకోవాలని పేర్కొంది. అయితే దీనిపై ఫైజల్ నుంచి ఇంకా స్పందన రాలేదు.
RRR: ఆ మార్వెల్ సూపర్ హీరోల పాత్రల్లో నటించేందుకు సై అంటోన్న తారక్, చరణ్‌లు!
