RRR: ఆ మార్వెల్ సూపర్ హీరోల పాత్రల్లో నటించేందుకు సై అంటోన్న తారక్, చరణ్‌లు!

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ‘నాటు నాటు’ సాంగ్‌కు గాను బెస్ట్ సాంగ్ అవార్డును అందుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పింది. ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలవడంతో, యావత్ దేశప్రజలు ఆర్ఆర్ఆర్ చిత్ర టీమ్‌ను ఆకాశానికెత్తుతున్నారు. దర్శకుడు రాజమౌళి ఇండియన్ సినిమాకు అంతర్జాతీయంగా వైభవాన్ని తీసుకొచ్చారని పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా ఆయన్న ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

RRR: ఆ మార్వెల్ సూపర్ హీరోల పాత్రల్లో నటించేందుకు సై అంటోన్న తారక్, చరణ్‌లు!

RRR Actors NTR Ram Charan Wishes To Do These Marvel Super Heroes Characters

RRR: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ‘నాటు నాటు’ సాంగ్‌కు గాను బెస్ట్ సాంగ్ అవార్డును అందుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పింది. ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలవడంతో, యావత్ దేశప్రజలు ఆర్ఆర్ఆర్ చిత్ర టీమ్‌ను ఆకాశానికెత్తుతున్నారు. దర్శకుడు రాజమౌళి ఇండియన్ సినిమాకు అంతర్జాతీయంగా వైభవాన్ని తీసుకొచ్చారని పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా ఆయన్న ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Rajamouli : RRR విజయం నమ్మలేనిది.. ఫారినర్స్ RRRని ఎందుకు అంత ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను..

ఇక లాస్ ఎంజెల్స్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ఈ కార్యక్రమానికి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో హాజరై, అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోని మార్వెల్ సూపర్ హీరోల సినిమాల్లో తారక్, చరణ్లు ఒకవేళ నటిస్తే, ఏ సూపర్ హీరో పాత్రను ఎంపిక చేసుకుంటారని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. దీనికి వారిద్దరు ఐరన్ మ్యాన్ లేదా కెప్టెన్ అమెరికా పాత్రల్లో నటిస్తామంటూ చెప్పుకొచ్చారు.

RRR Team at Golden Globe Awards Event : గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకకి ఫ్యామిలీ సమేతంగా RRR యూనిట్..

ఇప్పుడు ఈ వార్తతో హాలీవుడ్ మీడియాలో సరికొత్త చర్చ సాగుతోంది. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ఇండియన్ హీరోలు మరి నిజంగానే మార్వెల్ యూనివర్స్‌లో సూపర్ హీరోల పాత్రలు చేస్తే, ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ సినిమా నేడు సాధించిన రికార్డుతో ఆస్కార్ అవార్డు ఆశలపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆస్కార్ బరిలో ఈ సినిమా ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.