Rajamouli : RRR విజయం నమ్మలేనిది.. ఫారినర్స్ RRRని ఎందుకు అంత ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను..

ఓ హాలీవుడ్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. సాధారణంగా ఒక సినిమా విడుదల చేస్తే దాని హంగామా అంతా ఒక నెలలో అయిపోతుంది. కానీ RRR రిలీజయి ఇన్ని నెలలు అవుతున్నా.............

Rajamouli : RRR విజయం నమ్మలేనిది.. ఫారినర్స్ RRRని ఎందుకు అంత ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను..

Rajamouli comments on why RRR super hit in foreign countries also

Rajamouli :  RRR సినిమా రిలీజయి పది నెలలు అవుతున్నా ఇంకా రోజూ ఆ పేరు వినపడుతూనే ఉంది.. ఒక సినిమా ఎంత పెద్ద విజయం సాధించకపోతే ఈ రేంజ్ లో వినిపిస్తుంది. ఇప్పటికి కూడా హాలీవుడ్ లో ఏదో ఒక థియేటర్ లో RRR సినిమా ఆడుతుందంటే ఈ సినిమా ఇక్కడ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాక జపాన్, అమెరికాలలో కూడా భారీ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా.

ఇక ఈ సినిమాని మనకంటే కూడా ఎక్కువగా హాలీవుడ్ ప్రేక్షకులు, ఫారినర్స్ అభినందిస్తున్నారు. ఈ సినిమాలోని సన్నివేశాలకి, సాంగ్స్ కి ఫిదా అయిపోతున్నారు. మన కంటే బాగా ఈ సినిమాని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఎక్కడ విన్నా RRR సినిమా గురించే వినిపిస్తుంది. చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాని, దర్శకుడు రాజమౌళిని అభినందిస్తున్నారు. ఇప్పటికే పలు హాలీవుడ్ అవార్డులు గెలుచుకున్న RRR సినిమా తాజాగా నేడు ఉదయం ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ కి గాను ఈ అవార్డుని కీరవాణి అందుకున్నారు.

Rahul Sipligunj : నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. అంతర్జాతీయ స్టేజిపై నా పేరు చెప్పడం గర్వంగా ఉంది..

ఇక గత కొన్ని రోజులుగా హాలీవుడ్ లోనే ఉండి RRR సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఓ హాలీవుడ్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. సాధారణంగా ఒక సినిమా విడుదల చేస్తే దాని హంగామా అంతా ఒక నెలలో అయిపోతుంది. కానీ RRR రిలీజయి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఇంకా కొనసాగుతుంది. ఫారినర్స్ ఈ సినిమాని చాలా ఇష్టపడుతున్నారు. అంతగా ఫారినర్స్ ఈ సినిమాని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని గురించి రోజూ సోషల్ మీడియా, న్యూస్ లలో చదువుతున్నాను. ఈ సినిమాలో చూపించిన సూపర్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ వాళ్ళకి నచ్చుతున్నాయి. ఈ సినిమా అన్ని అంశాల కలయిక. సాధారణంగా భారతదేశంలో కథలు చాలావరకు ఇలాగే ఉంటాయి. ఈ సినిమా ఫారినర్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని అన్నారు.