మహబూబాబాద్ జిల్లాలో ప్రేమజంట బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లాలో ప్రేమజంట బలవన్మరణం

Updated On : December 23, 2020 / 4:27 PM IST

love couple end life in Mahabubabad district : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రేమ జంటల ఆత్మహత్యలు ఎక్కువై పోయాయి. పెద్దలను ఎదిరించి బతకలేక, ఒకరిని ఒకరు విడిచి ఉండలేక అతి చిన్న వయస్సులోనే బలవన్మరణాలకు పాల్పడుతూ జీవితాన్ని ముగించుకుంటున్నారు.

తాజాగా మహబూబాబాద్ జిల్లాలో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని గార్ల మండలం రాజుతండ పరిధిలోని వడ్ల అమ్రూ తండా శివారులో ఉన్న బావిలో ప్రేమికులిద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను గుగులోత్ ప్రశాంత్, భూక్యా ప్రవీణ గా గుర్తించారు.

తమ ప్రేమను పెద్దలు అంగీకరించక పోవటంతోటే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత వారం రోజుల్లో 3 ప్రేమ జంటలు బలవన్మరణానికి పాల్పడ్డాయి. వీరి మరణంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.