Attack on Girl friend : ప్రియురాలిపై అనుమానం .. వాట్సప్ హ్యాక్ చేసి….

టెక్నాలజీ  ట్రిక్కులు తెలుసుకుని ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడో ప్రియుడు. ప్రియురాలు మరో వ్యక్తితోనూ చాటింగ్ చేస్తోందని తెలుసుకున్న ప్రియుడు ఆమెను హత్య చేయబోయాడు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉంది.

Attack on Girl friend : ప్రియురాలిపై అనుమానం .. వాట్సప్ హ్యాక్ చేసి….

Attack on Girl friend

Updated On : April 24, 2021 / 3:30 PM IST

Attack on Girl friend : టెక్నాలజీ  ట్రిక్కులు తెలుసుకుని ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడో ప్రియుడు. ప్రియురాలు మరో వ్యక్తితోనూ చాటింగ్ చేస్తోందని తెలుసుకున్న ప్రియుడు ఆమెను హత్య చేయబోయాడు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉంది.

కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడు శ్రీరాంపురం కు చెందిన సౌమ్య(26) రమేష్ లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని టెక్నిక్కుల ద్వారా సౌమ్య వాట్సప్ ను హ్యాక్ చేసిన రమేష్, ఆమెకు వచ్చే వాట్సప్ మెసేజ్ లను తెలుసుకోవటం మొదలెట్టాడు. తనతో కాకుండా సౌమ్య వేరే వ్యక్తులతో కూడా చాటింగ్ చేస్తుండటం గుర్తించాడు. దీంతో ఆమె లవ్ కు బ్రేకప్ చెప్పాడు.

ఇటీవల ఆమెకు ఫోన్ చేసి..మాట్లాడాలి రమ్మనమని చెప్పి పిలిచాడు. ఆమెతో నమ్మకంగా మాట్లాడుతూ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పరిస్ధితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.