భార్య గురించి అసభ్యంగా మాట్లాడాడని స్నేహితుడి హత్య

man assasinates friend, about filthy words his wife : ఆవేశం, కోపం అనర్ధదాయకం అంటారు పెద్దలు. తన భార్యను బూతులు తిట్టాడనే కోపంతో ఒక వ్యక్తి తన స్నేహితుడ్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబై, వోర్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుశీల్ కుమార్ సర్ నాయక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. బ్యాంకులో ఉద్యోగం చేసే సుశీల్ కుమార్ గత శనివారం, డిసెంబర్12వ తేదీన తన స్నేహితుడ్ని కలవటానికి విరార్ వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాడు. ఆతర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి తల్లి సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం నేరల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మురికి కాలువలో పడి ఉన్న ఓబ్యాగులో మనిషి శరీర భాగాలు ఉన్నాయంటూ పోలీసులకు స్ధానికులు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు విడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులు కాలువలోకి ఎలా వచ్చాయి అనే కోణంలో ….ఆ సమీపంలోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నాడార్ అనే వ్యక్తి బ్యాగులను మోసుకువెళ్తూ కనిపించాడు. అతని చిరునామా సేకరించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసు విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ శరీర భాగాలు మిస్సింగ్ కేసు నమోదైన సుశీల్ కుమార్ సర్ నాయక్ వి గా పోలీసులు గుర్తించారు.
శనివారం ఉదయం ఇంటినుంచి బయలు దేరిన సుశీల్ విరార్ కాకుండా నేరల్ లోని ఇంకో మిత్రుడు చార్లెస్ నాడార్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి సాయంత్రం వరకు ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ సమయంలో సుశీల్ కుమార్ , నాడార్ భార్యను బూతులు తిట్టాడు. భార్యను అసహ్యంగా తిట్టటం సహించలేని నాడార్ సుశీల్ కుమార్ ను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 10 భాగాలుగా ముక్కలు కోసాడు. వాటిని బ్యాగుల్లో నింపి నేరల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మురికి కాల్వలో పడేశాడు.