Aurangzebs image : ఔరంగజేబు చిత్రాన్ని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్న యువకుడిపై పోలీసు కేసు

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా అప్‌లోడ్ చేసినందుకు నవీ ముంబయిలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారుఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు....

Aurangzebs image : ఔరంగజేబు చిత్రాన్ని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్న యువకుడిపై పోలీసు కేసు

Aurangzebs image

Updated On : June 12, 2023 / 9:29 AM IST

Aurangzebs image as WhatsApp profile picture:మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా అప్‌లోడ్ చేసినందుకు నవీ ముంబయిలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారు.నిందితుడు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్నాడు.ఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 298, 153 ఎ కింద నవీ ముంబయి పోలీసులు(Navi Mumbai)కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించి విడుదల చేశారు.ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.

Fashion Show Event Ramp Walk: నోయిడా ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి..ఇనుప స్తంభం పడి మోడల్ మృతి

ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంపై కొల్హాపూర్‌లో నిరసనలు చెలరేగాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్‌లను కీర్తించడంపై మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో మతపరమైన ఉద్రిక్తత సంఘటనలు చెలరేగాయి.ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది.

Cyclone Biparjoy intensifies: మహోగ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ తుపాన్..గుజరాత్‌లో తీరం దాటే అవకాశం

కొల్హాపూర్ నగరంలోని కొన్ని మితవాద సంస్థల ప్రజలు జూన్ 7వతేదీన కొల్హాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చారు.ఈ బంద్ హింసాత్మక నిరసనలకు దారితీసింది.‘‘మా మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని మేం సహించం. హిందూ సమాజం పరిరక్షణ కోసం కత్తులు దూసేందుకు సిద్ధంగా ఉన్నాం. దీన్ని సహించేది లేదు’’ అని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు.

US restaurant launches Modi ji thali:ప్రధాని మోదీ అమెరికా పర్యటన..యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

సంగమ్‌నేర్ పట్టణంలో ఓ బాలుడి హత్యకు ప్రతిగా సకల్ హిందూ సమాజ్ ర్యాలీలో రాళ్లు రువ్వారు.ఈ రాళ్ల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి.సంగమ్‌నేర్‌లో కూడా మతపరమైన ఊరేగింపు సందర్భంగా అభ్యంతరకరమైన నినాదాలతో ఔరంగజేబు పోస్టర్ ప్రదర్శించారని పోలీసులు తెలిపారు.