10 ఏళ్ళ పాటు మరదలి పై లైంగికదాడి చేసిన బావ : Facebook లో నగ్నఫోటోలు

  • Published By: chvmurthy ,Published On : February 22, 2020 / 03:27 AM IST
10 ఏళ్ళ పాటు మరదలి పై లైంగికదాడి చేసిన బావ : Facebook లో నగ్నఫోటోలు

Updated On : February 22, 2020 / 3:27 AM IST

భార్య అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని…..మరదలిపై కన్నేసి ఆమెను 10 ఏళ్లపాటు లైంగికంగా వేధించిన కీచకుడి బండారం బయట పడింది. పదేళ్లుగా బావ చూపించిన నరకాన్ని భరించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అక్క కాపురం బాగుండాలని ఇన్నాళ్లూ బావ పెట్టే టార్చర్ మౌనంగా భరించింది. మరదలి సహనాన్ని అలుసుగా తీసుకున్న బావ ఆమె నగ్న ఫోటోలు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి వికృత ఆనందం పొందాడు. సహనం నశించిన బాధితురాలు  ఫిబ్రవరి20, గురువారం నాడు గుంటూరు రూరల్‌ ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. 

గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన ఓ మహిళకు 2010లో అదే  గ్రామానికి చెందిన కె.రవికిరణ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది. అప్పటికి బాలిక వయస్సు 15 ఏళ్లు.  కొన్నాళ్ళకు రవికిరణ్ భార్య అనారోగ్యానికి గురవటంతో…ఇంటి పనులు చేసేందుకు సాయంగా ఉంటుందనే సాకుతో రవి కిరణ్‌ ఆ బాలికను తరచూ ఇంటికి తీసుకు వెళుతుండేవాడు. నిత్యం లైంగిక వేధింపులకు గురిచేసేవాడు.

తెలిసీ తెలియని వయస్సులో బావ చేసే పనులు ఎవరికీ చెప్పుకోలేక మొదట్లో  బాలిక మౌనంగా అవన్నీ భరించింది. ఒకసారి ఎదురు తిరగడంతో.. ఈ విషయం  ఎవరికైనా చెబితే నీ అక్క కాపురం నాశనం అవుతుందని మరదలిని బెదిరించాడు. నిజం చెబితే అక్కకాపురం ఎక్కడ నాశనం అయిపోతుందో అనే భయంతో మౌనంగా బావ చూపించే నరకాన్ని భరించింది.

ఇలా ఉండగా 2018 జూలైలో రవికిరణ్ తన మరదలిని తమిళనాడులోని వేళాంగిణి దేవాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఆమెకు బలవంతంగా తాళి కట్టి కామ కోర్కెలు తీర్చుకున్నాడు. ఈ సమయంలో రవికిరణ్ అత్తమామలు తమ కుమార్తె కనిపించటం లేదని  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రవికిరణ్‌ యువతితో కలిసి తెనాలి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆమెను బెదిరించి ఇష్టపూర్వకంగానే తాను బావతో  వెళ్లానని యువతితో చెప్పించాడు. 

అప్పటి నుంచి రవి కిరణ్‌ రోజూ తన భార్యను అకారణంగా కొట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు ఆ యువతికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొ్న్నాడు. రహస్యంగా తన మరదలు నగ్నంగా ఉన్న ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దీంతో సహనం నశించిన బాధితురాలు…. బావ నుంచి రక్షణ  కల్పించాలని, తన అక్క కాపురం చక్కదిద్దాలని ఫిర్యాదు చేసింది.