Delhi : పెళ్లి చేసుకోవాలన్నందుకు.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి
ఏప్రిల్ 12వ తేదీన పెళ్లి విషయంలో నాజ్, వినీత్ లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో వినీత్.. నాజ్ గొంతు నొక్కి హత్య చేశారు.

Delhi
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. ఏప్రిల్ 12న కరవాల్ నగర్ లోని కృష్ణ పబ్లిక్ స్కూల్ సమీపంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్య గావించవడ్డ మహిళను ఉత్తరాఖండ్ లోని మిరాజ్ పూర్ కు చెందిన 25 ఏళ్ల రోహినా నాజ్ అలియాస్ మహిగా గుర్తించారు.
పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నాజ్ మృతదేహాన్ని పారవేయడంలో నిందితుడికి సహకరించిన అతని సోదరి పారుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ప్రశ్నించగా మహిళ నాజ్ ను తన సోదరుడు వినీత్ హత్య చేసినట్లుగా తెలిపారు. కాగా, నిందితుడు వినీత్ కు నేర చరిత్ర ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి
2017లో బాగ్ పట్ లోని రామలా షుగర్ మిల్లులో వినీత్, అతడి తండ్రి హత్యకు పాల్పడినట్లుగా చెప్పారు. ఈ కేసులో 2019 అక్టోబర్ 25న తండ్రీకొడుకులు దోషులుగా తేలడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించినట్లు పేర్కొన్నారు. జైల్లో ఉన్న వినీత్ గతేడాది నవంబర్ 26న బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన నాజ్, వినీత్ సోదరి పారుల్ తో కలిసి ఢిల్లీలోని రూమ్ లో ఉండేవారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో బెయిల్ పై జైలు నుంచి విడుదలై వచ్చిన వినీత్.. నాజ్ తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని వినీత్ ను నాజ్ ఒత్తడి చేశారు. అయితే ఆమె వేరే మతానికి చెందటంతో వినీత్ కుటుంబం వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో నాజ్ ను అమ్మేయాలని వినీత్, అతని సోదరి పారుల్ మొదట ప్లాన్ వేశారు. కానీ, ఈ విషయం నాజ్ కు తెలియడంతో ఆమెను హత్య చేయాలని వినీత్, అతని సోదరి పారుల్ నిర్ణయించుకున్నారు.
Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్
ఏప్రిల్ 12వ తేదీన పెళ్లి విషయంలో నాజ్, వినీత్ లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో వినీత్.. నాజ్ గొంతు నొక్కి హత్య చేశారు. అనంతరం తన స్నేహితుడిని పిలువగా అతడు అక్కడికి బైక్ పై వచ్చాడు. తన సోదరి పారుల్ సహాయంతో నాజ్ మృతదేహాన్ని కృష్ణ పబ్లిక్ స్కూల్ సమీపంలో పడేశారు. వినీత్, అతడి స్నేహితుడి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు వినీత్ సోదరిని పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు.