Hyderabad : ప్రేమించలేదని వివాహితపై కత్తితో దాడి-మృతి

హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత మహిళ తనను ప్రేమించటం లేదని కోపంతో కత్తితో దాడి చేసాడో యువకుడు. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Hyderabad : ప్రేమించలేదని వివాహితపై కత్తితో దాడి-మృతి

Hyderabad Murder

Updated On : May 27, 2022 / 5:06 PM IST

Hyderabad  : హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత మహిళ తనను ప్రేమించటం లేదని కోపంతో కత్తితో దాడి చేసాడో యువకుడు. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

హఫీజ్‌బాబా‌ నగర్‌లోని ఒమర్ హోటల్ సమీపంలో నివసిచే నూర్‌భాను అనే వివాహిత మహిళను హబీబ్ అనే వ్యక్తి సంవత్సర కాలంగా ప్రేమించమని  వేధిస్తున్నాడు. హబీబ్ మాటలను పట్టించుకోని మహిళ అతడి ప్రేమను తిరిస్కరించింది.

నూర్‌భాను ఈరోజు ఒంటరిగా ఉన్న సమయంలో హబీబ్ కత్తితో  ఆమె వద్దకు వచ్చి  విచక్షణా రహితంగా ఆమెను పొడవడంతో తీవ్ర గాయాల పాలయ్యింది.  స్ధానికులు వెంటనే ఆమెను ఒవైసీ ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆమె చికిత్స  పొందుతూ మరణించింది. సంఘటనా స్ధలానికి వచ్చిన  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

Also Read : Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి