Live-In-Relationship : రెండేళ్లుగా మహిళతో సహజీవనం.. ఆమె మైనర్ కూతురుపై….

ఓ మహిళతో  వివాహేతర సంబంధం పెట్టుకున్న కీచకుడు ఆమె మైనర్ కుమార్తెపై కన్నేశాడు. తల్లికి తెలియకుండా మైనర్ బాలికపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

Live-In-Relationship : రెండేళ్లుగా మహిళతో సహజీవనం.. ఆమె మైనర్ కూతురుపై….

Man Raped Lover's Minor Daughter

Updated On : June 22, 2021 / 5:50 PM IST

Live-In-Relationship : ఓ మహిళతో  వివాహేతర సంబంధం పెట్టుకున్న కీచకుడు ఆమె మైనర్ కుమార్తెపై కన్నేశాడు. తల్లికి తెలియకుండా మైనర్ బాలికపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు.  హైదరాబాద్ శివారు నార్సింగిలో  ఆటోడ్రైవర్‌గా పనిచేసే  వ్యక్తి స్ధానికంగా ఉన్న మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈక్రమంలో  మైనర్ అయిన ఆమె కూతురిపై కన్నేశాడు.

ఇటీవల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈవిషయం బస్తీ వాసులకు తెలిసింది. సమాచారం తెలుసుకున్న చైల్డ్ కేర్ కమిటీ సభ్యులు  బస్తీవాసుల సహాయంతో బాలికను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం  నిందితుడిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.