Tamil Nadu : ఏటీఎంలోకి దూరాడు..ఇరుక్కున్నాడు, తర్వాత
ఏటీఎం సెంటర్ లో డబ్బులు దొంగిలిద్దామని వచ్చిన ఓ దొంగ..అందులో ఇరుక్కపోయాడు. చివరకు ఏం జరిగిందో తెలిసిందేగా.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Man Stuck
Man Stuck Behind ATM : దొంగతనమే వృత్తిగా పెట్టుకుంటారు కొందరు. పని చేయడం చేతకాక..ఏదో దొంగతనాలు చేస్తూ…జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. అయితే..దొంగతనం చేయడంలో వినూత్న పద్ధతులు అవలింబిస్తుంటారు. వారు చేసే దొంగతనాలు పోలీసులకే సవాల్ గా మారుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో..బెడిసి కొడుతుంటాయి. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలు లెక్కిస్తుంటారు. ఇలాగే జరిగింది. ఏటీఎం సెంటర్ లో డబ్బులు దొంగిలిద్దామని వచ్చిన ఓ దొంగ..అందులో ఇరుక్కపోయాడు. చివరకు ఏం జరిగిందో తెలిసిందేగా..
Read More : BMC Fine : ఉమ్మినవారికి రూ.39 లక్షలు.. మాస్క్ లేనందుకు రూ.60 కోట్ల జరిమానా
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. మెహనూర్ అనే ప్రాంతంలో అనియాపురంలో ఓ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్ ఉంది. అందులో ఉన్న డబ్బును దొంగిలించాలని ఓ యువకుడు నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన పథకాన్ని అమల్లో పెట్టేశాడు. రాత్రి వేళ…ఆ ఏటీఎం సెంటర్ లో దూరాడు.
Read More :Vendhu Thaninthathu Kaadu: ఫస్ట్ లుక్‌తో షాకిచ్చిన శింబు-గౌతమ్ మీనన్!
కానీ..మరలా బయటకు రాలేకపోయాడు. అందులో ఇరుక్కపోయాడు. బాధతో కేకలు వేశాడు. అక్కడనే ఉన్న స్థానికులకు కేకలు వినిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం బాక్స్ లో సగం ఇరుక్కపోయి ఉన్న అతడిని బయటకు తీసి స్టేషన్ కు పంపించారు. ఇతడిని విచారించారు. బారల్లి అనే ప్రాంతంలో కోళ్ల ఫామ్ లో వర్కర్ గా పనిచేస్తున్నట్లు, ఇతని స్వస్థలం బీహార్ అని పోలీసులు తెలుసుకున్నారు.