డ్యామిట్ కథ అడ్డం తిరిగింది : విగ్ పెట్టినా దొరికిపోయాడు

గోల్డ్ స్మగ్లింగ్ కోసం అతడు మంచి ప్లాన్ వేశాడు. తన తెలివిని ఉపయోగించి మాస్టర్ స్కెచ్ వేశాడు. తల మీద విగ్ పెట్టాడు. అందులో కిలో బంగారం ఉంచాడు. ఇక తాను ఎవరికీ

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 03:01 AM IST
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది : విగ్ పెట్టినా దొరికిపోయాడు

Updated On : October 6, 2019 / 3:01 AM IST

గోల్డ్ స్మగ్లింగ్ కోసం అతడు మంచి ప్లాన్ వేశాడు. తన తెలివిని ఉపయోగించి మాస్టర్ స్కెచ్ వేశాడు. తల మీద విగ్ పెట్టాడు. అందులో కిలో బంగారం ఉంచాడు. ఇక తాను ఎవరికీ

గోల్డ్ స్మగ్లింగ్ కోసం అతడు మంచి ప్లాన్ వేశాడు. తన తెలివిని ఉపయోగించి మాస్టర్ స్కెచ్ వేశాడు. తల మీద విగ్ పెట్టాడు. అందులో కిలో బంగారం ఉంచాడు. ఇక తాను ఎవరికీ దొరకనని సంబర పడ్డాడు. కానీ.. కథ అడ్డం తిరిగింది. విగ్ ఊడింది. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తి బండారాన్ని బట్టబయలు చేశారు.

వివరాల్లోకి వెళితే.. తెలివిగా గోల్డ్ స్మగ్లింగ్ చేద్దామనుకున్న ఓ యువకుడు కాలం కలిసిరాక అడ్డంగా బుక్కయ్యాడు. అతడి విగ్ కింద దాచిన కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కొచ్చి ఎయిర్ పోర్టులో జరిగింది. కేరళలోని మలప్పురానికి చెందిన నౌషద్‌.. షార్జా నుంచి వచ్చాడు. కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగాడు. బంగారం దాచేందుకు నౌషద్.. తన తలపై మధ్య భాగంలో వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఆ భాగంలో బంగారం పెట్టాడు. దానిపై జుట్టు అధికంగా ఉన్న విగ్‎ను కొనుగోలు చేసి ధరించాడు. అలా కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి తప్పించుకోవాలని అనుకున్నాడు.

అయితే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా నౌషద్‌ పట్టుబడ్డాడు. అతడి విగ్గులో కేజీ బంగారం బయటపడింది. తలపై మధ్య భాగంలో గుండు గీసుకుని విగ్గు సాయంతో బంగారంతో బయటపడాలని శ్రమించినా చివరికి అడ్డంగా దొరికిపోయాడు. విగ్గు ప్లాన్ చూసి అధికారులు షాక్ తిన్నారు. నౌషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల జులైలో బార్సెలోనా ఎయిర్ పోర్టులోనూ ఓ వ్యక్తి రూ.24 లక్షల కొకైన్ మాదక ద్రవ్యాన్ని ఇలాగే విగ్గులో పెట్టుకుని తరలించడానికి ప్రయత్నించి దొరికిపోయిన విషయం తెలిసిందే. 

విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దేశానికి తరలించేందుకు స్మగ్లర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు బూట్లలో మరికొందరు ఇస్త్రీ పెట్టెల్లో గోల్డ్ పెట్టుకుని వస్తున్నారు. ఇలా ఎన్ని ప్లాన్లు వేసినా కస్టమ్స్ అధికారుల ముందు వారి పప్పులు ఉడకటం లేదు.

Also Read : ఇదీ వాస్తవం : బండ్ల గణేష్ రూ.7 కోట్లు ఇవ్వాలి