Bank robbed in Udaipur : మణప్పురం గోల్డ్ బ్యాంక్‌లో చోరీ .. 18 నిమిషాల్లో రూ.14 కోట్లు దోపిడీ
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో భారీ దోపిడీ జరిగింది. కేవలం 18 నిమిషాల్లో రూ.14 కోట్లు విలువ చేసే నగలను దోచుకుపోయారు దొంగలు. ఉదయ్ పూర్ లోని సుందర్ వాస్ లోని మణప్పురం గోల్డ్ బ్యాంక్‌లో కొందరు దుండగులు ప్రవేశించి.. పిస్టళ్లతో బెదిరించి.. చోరీకి పాల్పడ్డారు.

Bank robbed in Udaipur :
Bank robbed in Udaipur : కన్నుమూసి తెరిచేంతలో కొన్ని దోపిడీలు జరిగిపోతుంటాయి. దొంగల చేతివాటం అది. ఆనూపాను చూసి దోచేస్తుంటారు. బ్యాంకులను దోచేస్తున్న దోపీడిగాళ్ళు కేవలం నిమిషాల వ్యవధిలోనే కోట్ల రూపాయల విలువ చేసే సొమ్ము కాజేసి అంతే స్పీడ్ గా పరారైపోతారు. వారికి పట్టుకోవాలంటే పోలీసులకు సవాల్ అనే చెప్పాలి. ఇక పోయిన సొమ్ము దక్కించుకోవటం అనేది మరో ఎత్తు..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో భారీ దోపిడీ జరిగింది. కేవలం 18 నిమిషాల్లో రూ.14 కోట్లు విలువ చేసే నగలను దోచుకుపోయారు దొంగలు. ఉదయ్ పూర్ లోని సుందర్ వాస్ లోని మణప్పురం గోల్డ్ బ్యాంక్‌లో కొందరు దుండగులు ప్రవేశించి.. పిస్టళ్లతో బెదిరించి.. చోరీకి పాల్పడ్డారు. సోమవారం (ఆగస్టు 29,2022) ఉదయం 9.20 గంటలు. ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు బైక్ లపై వేగంగా వచ్చి ఓ భవనం ముందు ఆగారు. చేతిలో మారణాయుధాలతో అంతే వేగంగా భవనంలోకి దూసుకెళ్లారు.
ఆ భవనం మణప్పురం గోల్డ్ బ్యాంక్. భవనం లోపల ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అదే అదనుగా భావించినదుండగులు పిస్తోళ్లతో ఎటాక్ చేశారు. మేనేజన్ పై దాడి చేశారు. సిబ్బంది కాళ్లు చేతులు కట్టేశారు. ఎటూ కదలకుండా చేశారు. అలా 18 నిమిషాల పాటు ఆగంతకులు దాదాపు రూ.14 కోట్ల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదు దోచుకుపోయారు. అచ్చంగా సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ తీవ్ర కలకలం సృష్టించింది. ఉదయ్ పూర్ లోనే అత్యంత భారీ దోపిడీగా పేర్కొన్నారు పోలీసులు.
పట్టపగలు కేవలం 18 నిమిషాలు..ఏకంగా రూ.14 కోట్ల విలువచేసే 24 కేజీల బంగారం, పది లక్షల డబ్బును దోచుకెళ్లారు. తర్వాత నిమిషాల్లో అక్కడ నుంచి మాయమయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. వెంటనే నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నగర కూడళ్లలో విస్తృతం తనిఖీలు చేస్తున్నారు. ఎలాగైనా నిందితులను పట్టుకుంటామన్నారు.