విమానాశ్రయంలో బాంబు పెట్టిన వ్యక్తి లొంగుబాటు

  • Published By: chvmurthy ,Published On : January 22, 2020 / 07:49 AM IST
విమానాశ్రయంలో బాంబు పెట్టిన వ్యక్తి లొంగుబాటు

Updated On : January 22, 2020 / 7:49 AM IST

మంగుళూరు ఎయిర్ పోర్టులో ప్రవేశ ద్వారం వద్ద  పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్ను పెట్టిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతడి పేరు ఆదిత్యరావు గా పోలీసులు చెప్పారు. జనవరి 20 సోమవారం రోజు నిందితుడు IMD పేలుడు పదార్ధాలు కలిగిన బ్యాగ్ ను మంగుళూరు విమానాశ్రయంలో వదిలి పెట్టి వెళ్లాడు. ఆదిత్యరావు బుధవారం బెంగుళూరులోని హాల్సూరు పోలీసు స్టేషన్ లో  లొంగిపోయాడు. అతని మానసికస్ధితి సరిగా లేదని పోలీసులు చెప్పారు.
mangalore air port

నిందితుడిని విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని బెంగుళూరు పంపిస్తున్నట్లు మంగుళూరు పోలీసు కమీషనర్ హర్ష చెప్పారు. నిందితుడు  పెట్టిన బాంబు పేలి ఉంటే భారీ నష్టం సంభవించి ఉండేది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 3  ఫ్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. కాగా ఈలోపే నిందితుడి పోలీసులకు లొంగిపోయాడు.

విమానాశ్రయంలో బాంబును గుర్తించిన భధ్రతా సిబ్బంది వెంటనే దాన్ని నిర్జనప్రదేశంలో దాన్ని పేల్చివేశారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు ఆటో డ్రయిువర్ ను అదుపులోకి  తీసుకుని ప్రశ్నించగా నిందితుడి వద్ద  మరోక బ్యాగు ఉందని, విమానాశ్రయానికి వెళ్లటానికి కెంజార్ లోని ఒక సెలూన్ వద్ద ఆటో ఎక్కినట్లు చెప్పాడు. తిరిగివచ్చేటప్పుడు పంపు వెల్ జంక్షన్ వద్ద దిగి ఇంకో బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నట్లు ఆటో డ్రయివర్ చెప్పాడు.