Woman Suicide : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపధ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ శివారు నున్న పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Woman Suicide : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

married woman suicide

Updated On : February 18, 2022 / 2:57 PM IST

Woman Suicide : ప్రతి చిన్న విషయానికి  ఆవేశాలకు లోనై  బంగారం లాంటి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు కొందరు. కుటుంబ  కలహాల నేపధ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ శివారు నున్న పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తుమ్మల సాయిజ్యోతి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.