మారుతీరావు ఆస్తులు రూ.200 కోట్లు, ఛార్జిషీటులో సంచలన విషయాలు

  • Published By: sreehari ,Published On : March 10, 2020 / 09:20 AM IST
మారుతీరావు ఆస్తులు రూ.200 కోట్లు, ఛార్జిషీటులో సంచలన విషయాలు

Updated On : March 10, 2020 / 9:20 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేశారు ఈ కేసులో ఎ1 నిందితుడిగా మారుతీరావు పేరును చేర్చిన పోలీసులు ఎ6 నిందితుడిగా మారుతీరావు సోదరడు శ్రవణ్ కుమార్ పేరు చేర్చారు.

పోలీసుల ఛార్జ్ షీటులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మారుతీరావు ఆస్తులకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మారుతీరావు ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు అప్పగించారు. మార్కెట్ ప్రకారం.. మారుతీరావు ఆస్తుల విలువ రూ. 200 కోట్లు వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

తొలుత కిరోసిన్ డీలర్ గా వ్యాపారం చేసిన మారుతీరావు తర్వాత రైస్ మిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 15ఏళ్ల క్రితం రైస్ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. మిర్యాలగూడలో కుమార్తె అమృత పేరుతో 100 పడకల ఆస్పత్రులను నిర్మించాడు. భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

అలాగే మిర్యాలగూడలో బైపాస్ రోడ్డులో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడ ఈదులగూడెం రోడ్డులో షాపింగ్ మాల్స్, మారుతీరావు తల్లి పేరు మీద రెండు అంతస్థుల షాపింగ్ మాల్స్ కూడా ఉంది. హైదరాబాద్ లోని కొత్తపేటలో 400 గజాల ప్లాట్లు, వేర్వేరు చోట్ల ఐదు అపార్ట్ మెంట్లు ఉన్నాయి.(ప్రణయ్ హత్య కేసులో 1200 పేజీల ఛార్జ్‌ షీట్‌..సంచలన విషయాలు వెల్లడి)

ఇక పోలీసులు దాఖలు చేసిన షార్జ్ షీట్‌లో అమృత, ప్రణయ్‌ల ప్రేమ, పెళ్లికి అంశాలను కూడా పొందుపరిచారు. ఈ కేసులో 102 మందిని సాక్షులు విచారించిన పోలీసులు.. ప్రణయ్ తండ్రి, ప్రణయ్ భార్య స్టేట్ మెంట్లను చేర్చారు. కాగా, ప్రణయ్ హత్య కేసు విచారణకు ఈ నెల 23కి వాయిదా పడింది. ప్రణయ్ హత్య కేసు నిందితులును కోర్టులో హాజరుపరిచారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కోర్టులో జడ్జీకి తెలిపారు. దీంతో హత్యకేసుపై విచారణ మార్చి 23కి వాయిదా పడింది. 

See Also | బేర్‌తో కలిసి డేర్‌గా.. రజనీ స్టైల్ అదుర్సు కదూ!..