వ్యాపారి సూసైడ్ : ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు

హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఆత్మహతకు పాల్పడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : March 8, 2019 / 05:37 AM IST
వ్యాపారి సూసైడ్ : ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు

హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఆత్మహతకు పాల్పడ్డాడు.

హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. ఓ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నేహపురికాలనీలో మార్చి 8 శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటికొచ్చిన వెంకటేష్‌ గుప్తా అనే వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే  మృతి చెందాడు. ఆత్మహత్య దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇటీవలే ఎర్రగడ్డ జాతీయ రహదారిపై మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 
Also Read : Sky for ALL : @ 799లకే విమాన టికెట్