Electricity Meters Scam: ఒకే ఇంట్లో 30 కరెంట్ మీటర్లు.. రెండేళ్లుగా బిల్లులు కూడా కడుతున్నాడు.. ఎందుకు అంటే.. Netflix వెబ్ సిరీస్ ని మించిన ప్లాన్..
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి ఇంటి నెంబర్లు లేకుండానే అతగాడు కరెంట్ మీటర్లకు పర్మిషన్లు పొందాడట.

Electricity Meters Scam: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కన్నింగ్ ఐడియాలతో బరి తెగిస్తున్నారు. ఊహకు అందని స్కెచ్ లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు ఓ కేటుగాడు ఖతర్నాక్ కన్నింగ్ ఐడియా వేశాడు. Netflix వెబ్ సిరీస్ ని మించిన ప్లాన్ గీశాడు. అతడి కన్నింగ్ బుర్రకు పోలీసులే విస్తుపోయారు.
ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా.. ఏకంగా 30 విద్యుత్ మీటర్లు తీసుకున్నాడు. ప్రతి నెల వాటికి మినిమం బిల్లులు కూడా కడుతున్నాడు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆ మీటర్ల సాయంతో రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అతగాడీ స్కెచ్ వేశాడని తెలుసుకుని అవాక్కయ్యారు.
దుండిగల్ లో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అక్రమంగా 30 విద్యుత్ మీటర్లు తీసుకున్నాడు. ప్రతి నెల మినిమం బిల్లులు చెల్లిస్తూ వస్తున్నాడు. ఇలా రెండేళ్లు గడిచాయి. సడెన్ గా పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు రైడ్ చేయడంతో అతగాడి బండారం బట్టబయలైంది. విద్యుత్ అధికారుల ఫిర్యాదుతో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సర్వే నెంబర్ 454లోని ఓ ఇంట్లో విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు దాడులు జరిపారు.
ఈ దాడుల్లో ఆ ఇంట్లో ఏకంగా 30 విద్యుత్ మీటర్లు గుర్తించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి ఇంటి నెంబర్లు లేకుండానే అతగాడు కరెంట్ మీటర్లకు పర్మిషన్లు పొందాడట. అంతేకాదు వాటికి రెండేళ్లుగా బిల్లులు కూడా కడుతున్నాడని తెలుసుకుని మరింత షాక్ అయ్యారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మీటర్ల సాయంతో రెగ్యులరైజేషన్ చేయించేందుకు అతగాడు కుట్ర చేశాడని, అందులో భాగంగా ఇలా 30 మీటర్లు తీసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
కాగా, ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చేతివాటం బయటపడింది. డబ్బులు తీసుకుని మీటర్లకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది. నిబంధలనకు విరుద్ధంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు ఉన్నతాధికారులు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here