ఫేస్ బుక్ ప్రేమ- స్నేహితులతో కలిసి 3 రోజులు అత్యాచారం చేసిన ప్రియుడు

ఫేస్ బుక్ ప్రేమ- స్నేహితులతో కలిసి 3 రోజులు అత్యాచారం చేసిన ప్రియుడు

Updated On : December 29, 2020 / 12:26 PM IST

Minor girl gang raped 2days by facebook friend : కరోనా కష్ట కాలంలో ఆన్ లైన్ క్లాసులకోసం పిల్లలకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్ తో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకున్నారు. అవి దారి తప్పి ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన స్నేహం ముదిరి ప్రేమగా మారింది. అపరిచిత వ్యక్తితో పెరిగిన స్నేహంతో ఒక మైనర్ బాలిక జీవితం నాశనమైంది. పిల్లలు పేస్ బుక్, షేర్ చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచిత వ్యక్తులతో స్నేహం చేస్తున్నారు.

ఇటీవల రంగారెడ్డిజిల్లాకు చెందిన బాలిక ఫేస్ బుక్ స్నేహితుడి కోసం కరీంనగర్ వెళ్ళగా పోలీసులు సకాలంలో స్పందించి బాలికను క్షేమంగా ఇంటికి చేర్చారు. కానీ మహబూబాబాద్ కు చెందిన మైనర్ బాలిక ఫేస్ బుక్ ప్రేమికుడు ,అతని స్నేహితుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది,

మహబూబాబాద్ జిల్లా నరసింహులు పేటకు చెందిన ఇంటర్ సెకండియర్ చదువుతున్న మైనర్ బాలికకు ఫేస్ బుక్ ద్వారా, ఏపీలోని జంగారెడ్డి గూడెం కు చెందినసింహాద్రి మురారి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఫేసు బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఇద్దూర రోజు చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. ఈ క్రమంలోమురారి.. యువతిని ప్రేమిస్తున్నాని చెప్పాడు. నెలల తరబడి చాటింగ్ చేసుకున్న తర్వాత పర్సనల్ గా కలవాలని మురారి బాలికను వత్తిడి చేశాడు.వద్దని వారించినా కలవాలని వత్తిడి చేయటంతో అతడి మాటలకు మోసపోయి, దైర్యం చేసి జంగారెడ్డి గూడెం బయలు దేరింది.

బస్సులో వచ్చిన ఆయువతిని కలుసుకున్న మురారి రోజంతా బాలికను బైక్ పై ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిప్పి చూపించాడు. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్తానని బాలిక చెప్పగా ఈ రాత్రికి ఇక్కడే ఉండు.. రేపు ఉదయాన్నే బస్సు ఎక్కిస్తానని చెప్పే సరికి ప్రేమ మాయలో పడిన బాలిక సరే అంది. దీంతో మురారి పక్క గ్రామమైన అశ్వారావు పేటలో తనకు తెలిసిన ఒక హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. మైనర్లకు రూమ్ ఇవ్వకూడదనే రూల్ ఉన్నప్పటికీ లాడ్జి ఓనర్ కొడుకు మురారి స్నేహితుడు కావటంతో ఆ నిబంధన పట్టించుకోలేదు. ఆ రాత్రికి వారిద్దరూ లాడ్జిలోనే బస చేశారు. ఆ సమయంలో వారిద్దరూ సన్నిహితంగా మెలిగారు.

మర్నాడు ఉదయం తన ఇద్దరు స్నేహితులను పరిచయం చేశాడు. వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ పరిణామానికి హతాశురాలైన బాలిక తనను ఇంటికి పంపించమని ప్రాధేయపడగా ఆమె ఫోన్ లాక్కోని….ఎదురు తరిగితే చంపేస్తామని బెదిరించి, 2 రోజులపాటు ముగ్గురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈలోగా తమ కుమార్తె కనిపించకపోవటంతో బాలిక తల్లి తండ్రులు తొర్రూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాలుగో రోజు వారి చెరనుంచి బయట పడిన  బాలిక ఫోన్ ద్వారా తల్లి తండ్రులకు జరిగిన విషయం చెప్పింది. అప్పటికే కేసు నమోదు చేసుకున్న తొర్రూరు పోలీసులు బాలికను వరంగల్ లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితుడు మురారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. నిందితులకోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.