Minor Girl Raped : మైనర్ బాలికపై పెంపుడు తండ్రి అత్యాచారం
మైనర్ బాలికను పెంపుడు తండ్రి గర్భవతిని చేసిన ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Minor Girl Raped
Minor Girl Raped : కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వావి వరసలు కూడా మరిచి ఆడది కనిపిస్తే చాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. కనీసం కనికరం లేకుండా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు.
మైనర్ బాలికను పెంపుడు తండ్రి గర్భవతిని చేసిన ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లం పేట్ లో ఒక జంట పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆ మహిళకు ఓ కూతురు ఉంది.
Also Read : Gun Culture : తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్-కట్టడికి పోలీసుల యత్నాలు
తల్లికి తెలియకుండా మారు తండ్రి కూతుర్ని లోబరుచుకున్నాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇటీవలి కాలంలో కూతురు ఆరోగ్యం క్షీణంచటంతో తల్లి బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పారు.
బాలిక తల్లికి జరిగిన విషయం అంతా చెప్పటంతో షాక్ కుగురైన తల్లి ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.