BJP MP : బీజేపీ ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం

బీజేపీ ఎంపీ కౌషల్ కిషోర్ కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ పార్లమెంట్ స్ధానం నుంచి కౌశల్ కిషోర్ భారతీయ జనతాపార్టీ తరుఫున గెలిచారు.

BJP MP : బీజేపీ ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం

Bjp Mp Daughter In Law Suicide Attempt

Updated On : March 15, 2021 / 5:23 PM IST

Mohanlalganj BJP MP Kaushal Kishore’s daughter-in-law suicide attempt : బీజేపీ ఎంపీ కౌషల్ కిషోర్ కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ పార్లమెంట్ స్ధానం నుంచి కౌశల్ కిషోర్ భారతీయ జనతాపార్టీ తరుఫున గెలిచారు.

లక్నో సమీపంలోని కకోరి లో ఆయన కోడలు అంకిత చేతి మణికట్టువద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.అంతకు ముందు ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల  చేశారు. అందులోఆమె తన భర్త, అత్తమామలుగురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన అలీగంజ్ ఎస్పీ అఖిలేష్ సింగ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి అంకిత ఆచూకి కోసం గాలించారు. అర్ధరాత్రి దాటాక ఆమె ఆచూకి లభించింది.

అంకితకు సంబంధించి మరో రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటికే ఆమె చేయ్యి మణికట్టు వద్ద కోసుకుంది. వాటిలో ఆమె తాను పుట్టింట్లో ఉంటూ భర్త కోసం ఎదురుచూస్తున్నానని… భర్త ఇంక రాడని డిసైడ్ అయి ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నానని తెలిపింది. తన చావుకు భర్త , అత్తమామలే కారణమని ఆరోపించింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.