Molestation : హోటల్‌లో దారుణం.. మహిళపై లైంగిక దాడి, మద్యం తాగించి
Molestation On Woman : బాధితురాలిపై నిందితులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను కాపాడాలని బాధితురాలు ఆర్తనాదాలు పెట్టడం వీడియోలో ఉంది.

Molestation On Woman (Photo : Google)
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. స్త్రీలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఓ హోటల్ లో దారుణం జరిగింది. మహిళపై లైంగిక దాడి జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఒక మహిళ నిందితులకు సహకరించింది.
బాధితురాలు ఓ హోటల్ లో పని చేస్తుంది. నలుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆమె స్నేహితురాలు బలవంతంగా మద్యం తాగించగా.. నిందితులు లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత హింసించారు. బాధితురాలి తలపై మద్యం సీసాతో కొట్టారు. ఈ నెల 11న ఈ దారుణం జరిగింది.
Also Read : షాకింగ్.. దీపావళికి బోనస్, సెలవు ఇవ్వలేదని ఓనర్‌ని హత్య చేసిన సిబ్బంది
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. బాధితురాలిపై నిందితులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను కాపాడాలని బాధితురాలు ఆర్తనాదాలు పెట్టడం వీడియోలో ఉంది.
బాధితురాలి వయసు 25 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియో తీశారని, దాంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. మహిళపై లైంగిక దాడికి సంబంధించి తమకు ఫిర్యాదు అందిందని, వెంటనే తాము స్పాట్ కి వెళ్లామని, బాధితురాలిని కాపాడామని, నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసి రిపోర్టు వచ్చాక దాని ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
Also Read : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376(లైంగిక దాడి), 307(హత్యాయత్నం), 323(కావాలని గాయపర్చడం) కింద కేసులు నమోదు చేశారు. హోటల్ మేనేజర్, అతడి స్నేహితులతో పాటు హోటల్ లో పని చేసే ఓ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిపై లైంగిక దాడి చేయడానికి నిందితులకు ఆ మహిళ సహకారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.
Thank You UP Police reached the spot where a case of gang rape of a female employee has come to light in Hotel Home Stay in Agra, UP and arrested 4 accused Ravi, Jitendra, Manish and Dev Kishore. #agra #AryanKhan #SidKiara #BadhteChalo #Tejran #SalmanKhan #KatrinaKaif pic.twitter.com/ZkObUycTUw
— Mukesh Fauji (@mukesh1yadav87) November 13, 2023
आगरा :असमत बचाने के लिए युवती दरिंदो के आगे लगाती रही गुहार
युवती के साथ दरिंदों ने की गैंगरेप की वारदात
दुष्कर्म पीड़िता युवती की हालत गंभीर
रिच होम स्टे होटल में हुई वारदात
सूचना मिलने पर पहुंची को बदहवास हालत में मिली युवती
पीड़िता युवती गेस्ट हाउस में करती थी… pic.twitter.com/3gF9WRLlOS
— News1Indiatweet (@News1IndiaTweet) November 13, 2023