Tragedy : భర్త పేకాట వ్యసనం… భార్య,కూతురు ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేకాట వ్యసనానికి బానిసైన భర్త ఉన్న ఇంటిని అమ్మేశాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలొచ్చాయి. మనస్తాపం చెందిన భార్య కూతురుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.

Tragedy : భర్త పేకాట వ్యసనం… భార్య,కూతురు ఆత్మహత్య

Tragedy

Updated On : May 22, 2021 / 4:53 PM IST

Tragedy :  అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పేకాట వ్యసనానికి బానిసైన భర్త ఉన్న ఇంటిని అమ్మేశాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవలొచ్చాయి. మనస్తాపం చెందిన భార్య కూతురుతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.

జిల్లాలోని ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ కాలనీకి చెందిన వీరమ్మ భర్త గోపీ పేకాటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బులు అవసరమై తానునివసిస్తున్న ఇంటిని రూ.10లక్షలకు విక్రయించాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో తీవ్రమనస్తాపానికి గురైన భార్య వీరమ్మ తన 9 ఏళ్ల కుమార్తెతో కలిసి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

సమచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాలను చెరువులోంచి బయటకు తీసారు. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికితరలించారు. కేసునమోదు చేసుకుని భర్త గోపీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.