Extra Marital Affair : వివాహేతర సంబంధం-పుట్టే బిడ్డ కోసం కొట్టుకున్నఇద్దరు ప్రియులు
తమిళనాడులోని ఒక వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

Extra Marital Affair
Extra Marital Affair : చేసేదే పాడు పని..అందులో మళ్ళీ పోటీలు ..ఎవరికైనా చెపితే నవ్విపోతారు. తమిళనాడులోని ఒక వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈక్రమంలో మహిళ గర్భం దాల్చింది. పుట్టబోయే బిడ్డకు నేనంటే నేను తండ్రినని ఇద్దరు ప్రియులు కత్తులతో దాడి చేసుకున్న ఘటన సేలం జిల్లాలో జరిగింది.
జిల్లాలోని అయోధ్య పట్టణం రామ్‌నగర్‌కు చెందిన మురుగేశన్ రెండో భార్య కలైమణి(23) అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్(23) కృపై రాజ్(23) అనే వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కలైమణి గర్భం దాల్చింది. ఈవిషయాన్ని తన ప్రియులిద్దరికీ శుక్రవారం చెప్పింది. ఇద్దరు ప్రియులూ ఒకేసారి ప్రియురాలి వద్దకు వచ్చారు.
Also Read : Cruel Father : మరదలినిచ్చి పెళ్లి చేయలేదని నలుగురు కూతుళ్లను చంపిన తండ్రి
కడుపులో బిడ్డకు నేను తండ్రినంటే, నేనే తండ్రిని అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన కలైఅరసన్ కత్తి తీసుకుని కృపారాజ్‌ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. కృపారాజ్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కలైమణి, కలై అరసన్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.