Vanasthalipuram Robbery Case : రూ.2 కోట్లు కాదు రూ.25 లక్షలే.. హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో మరో ట్విస్ట్

హైదరాబాద్ లో సంచలనం రేపిన వనస్థలిపురం రూ.2కోట్ల నగదు దోపిడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. దోపిడీకి గురైన సొమ్ము రూ.2కోట్లు కాదని.. రూ.25లక్షలేనని పోలీసులు తేల్చారు. వ్యాపారి వెంకట్రామి రెడ్డి నుంచి దొంగలు రూ.25లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.

Vanasthalipuram Robbery Case : రూ.2 కోట్లు కాదు రూ.25 లక్షలే.. హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో మరో ట్విస్ట్

Updated On : January 10, 2023 / 7:11 PM IST

Vanasthalipuram Robbery Case : హైదరాబాద్ లో సంచలనం రేపిన వనస్థలిపురం రూ.2కోట్ల నగదు దోపిడీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే దోపిడీకి గురైన డబ్బు హవాలా సొమ్ముగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దోపిడీకి గురైన సొమ్ము రూ.2కోట్లు కాదని.. రూ.25లక్షలేనని పోలీసులు తేల్చారు. బార్ ఓనర్ వెంకట్రామి రెడ్డి నుంచి దొంగలు రూ.25లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ. 2కోట్ల నగదు దోపిడీ అయినట్లు వ్యాపారి వెంకట్రామి రెడ్డి ఫిర్యాదు చేయగా.. కేవలం రూ.25 లక్షలు మాత్రమే చోరీకి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగలను గుర్తించారు పోలీసులు. మరోవైపు వెంకట్రామి రెడ్డి, ఫరూక్, ఎన్నారై ప్రవీణ్ ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్వోటీ, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read..Rajasthan : తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ప్రతీకార హత్యలు

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసు విచారణలో అనేక ట్విస్టులు, సస్పెన్స్ లు తెరపైకి వస్తున్నాయి. అసలీ కేసులో దోపిడీకి గురైన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దోపిడీ గురించి ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులకు అనేక అనుమానాలు కలిగాయి. దర్యాఫ్తు సమయంలో ఎన్నారై ప్రవీణ్, ఫరూక్ పేర్లు తెర మీదకు వచ్చాయి. వీరిద్దరు ఎవరు? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసు దర్యాఫ్తులోనే హవాలా వ్యవహారం వెలుగుచూసింది. మూడు వేర్వేరు విభాగాలు దీనిపై దర్యాఫ్తు చేస్తున్నాయి. హవాలాకు సంబంధించిన కోణం ఏముంది? అనే కోణంలో సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.(Vanasthalipuram Robbery Case)

ఫరూక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎస్వోటీ పోలీసులు. ఈ దోపిడీ గురించి మీడియాలో కథనాలు రావడంతో ఫరూక్ కనిపించకుండా పోయాడు. ఓవరాల్ గా ఈ కేసులో మూడు అంశాలపై సస్పెన్స్ నెలకొంది. దోపిడీకి గురైన నగదు ఎంత? దీనిపై ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేదు. దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇక మూడో అంశం హవాలాకు సంబంధించినది. స్పెషల్ టీమ్స్ ఈ కేసుని దర్యాఫ్తు చేస్తున్నాయి.

Also Read..Kerala Anjushree Death Case : బిర్యానీ తిని యువతి మృతి కేసులో ట్విస్ట్.. అంజుశ్రీ మరణానికి కారణం ఏంటంటే..

ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత దోపిడీ అన్నారు. ఆ తర్వాత దొంగ సొమ్ము అని బయటపడింది. అతిపెద్ద హవాలా లింక్ లు ఈ దోపిడీ వెనుక ఉన్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. ఈ హవాలా వెనుక ఎవరెవరు ఉన్నారు? ఇప్పటివరకు ఎంత కాజేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వ్యాపారి వెంకట్రామి రెడ్డి.. పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఫిర్యాదులో రూ.50 లక్షలు పోయాయని వెంకట్ రెడ్డి చెప్పాడు. అయితే.. వెంకట్ రెడ్డి తో పాటు ఉన్న నరేష్ అనే వ్యక్తి.. కోటిన్నర పోయిందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా.. పొంతన లేని సమాచారం ఇవ్వడంతో.. పోలీసులకు డౌట్లు వచ్చాయి. అసలు దోపిడీ జరిగిందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.

తర్వాత రూ. 25 లక్షలు దోపిడీ జరిగిందని పోలీసుల తేల్చేశారు. అంతేకాదు దోపిడీ చేసిన నిందితులను కూడా గుర్తించారు. హవాలా వ్యవహారంపై స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. పాతబస్తీకి చెందిన ఫరూక్ తో పాటు విదేశాల్లో ఉన్న ప్రవీణ్ అనే వ్యక్తికి హవాలా వ్యవహారంతో లింకులు ఉన్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అసలేం జరిగిందంటే..
వనస్థలిపురంకు చెందిన వెంకట్రామి రెడ్డి రెండు వైన్ షాప్ లు, ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి బార్ మూసేసిన తర్వాత వచ్చిన కలెక్షన్ డబ్బును బ్యాగులో పెట్టుకుని నరేష్ అనే వ్యక్తితో ఇంటికి బయల్దేరాడు వెంకట్రామిరెడ్డి. దారిలో దుండగులు వారిని అడ్డగించారు. వెంకట్రామి రెడ్డిపై దాడి చేసి అతడి దగ్గర నగదు ఉన్న బ్యాగ్ ను దోచుకెళ్లారు.

ఏకంగా రూ.2 కోట్ల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు బయటపడుతున్నాయి. అది దొంగ సొమ్ము అని పోలీసులు తేల్చారు. ఇప్పుడేమో దోపిడీకి గురైన సొమ్ము రూ.2కోట్లు కాదని, రూ.25 లక్షలేనని నిర్ధారించారు.

విచారణలో ఆ డబ్బంతా హవాలా డబ్బుగా పోలీసులు గుర్తించారు. అమెరికా నుండి ప్రవీణ్ అనే వ్యక్తి ఈ డబ్బు పంపిస్తుండగా.. హైదరాబాద్ లో ఆ డబ్బును మార్పిడి చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. MRR బార్ యజమాని వెంకట్రామి రెడ్డి, రియాసత్ నగర్ కు చెందిన ఫరూక్ లు ఈ హవాలా లావాదేవీలు చేస్తున్నటు తెలుసుకున్నారు. ఇప్పటివరకు వీరికి రూ.28 కోట్లు హవాలా మనీ అందినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ఫరూక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.