Husband Murder: యాక్సిడెంట్ కాదు మర్డర్..! యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం.. సినీ ఫక్కీలో భర్తను హత్య చేయించిన భార్య..
మొదటగా యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు.

Husband Murder: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తను సినీ ఫక్కీలో హత్య చేయించింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని స్వామిగా పోలీసులు గుర్తించారు. స్వామి బైక్ పై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు గుర్తించారు.
యాక్సిడెంట్ గా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని తెలిసింది. కారుతో స్వామి బైక్ ని ఢీకొట్టి చంపినట్లుగా నిర్ధారించుకున్నారు. స్వామి మృతిపై విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది.
మొదటగా యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు. కారుని అద్దెకు తీసుకుని స్వామిని చంపించినట్లుగా గుర్తించారు. స్వామి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య ఉదంతం బయటపడింది. స్వామి భార్యతో పాటు బామ్మర్ది, సుపారీ కిల్లర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.