Nurse Suicide : కొలీగ్ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతిని అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సహోద్యోగి వేధింపులకు గురి చేయటంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.

Nurse Suicide : కొలీగ్ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

Nurse Suicide

Updated On : October 4, 2021 / 1:53 PM IST

Nurse Suicide :  ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతిని అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సహోద్యోగి వేధింపులకు గురి చేయటంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. వర్షిత అనే యువతి ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ హాస్టల్ లో నివసిస్తోంది. ఆమె ఉద్యోగం చేస్తున్న ఆస్పత్రిలో పని చేసే మధు అనే వ్యక్తి వర్షితను డబ్బుల కోసం వేధించసాగాడు.

Also Read : Cops Raid On Prostitution Center : మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం…ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు అరెస్ట్

అతని వేధింపులు భరించలేని వర్షిత అధిక మోతాదులో స్టెరాయిడ్ లు తీసుకుని హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. వర్షిత ఆత్మహత్యకు వేధింపులు కారణమా,  ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.