Cop Son Loot Bank : బ్యాంకులో రూ. 15 లక్షలు లూటీ.. పోలీసు అధికారి కొడుకు అరెస్ట్!
పోలీసు అధికారి కుమారుడు ఓ ప్రైవైటు బ్యాంకులో లూటీకి పాల్పడ్డాడు. తండ్రి సర్వీసు రివాల్వర్ తీసుకెళ్లి బ్యాంకు అధికారులను బెదిరించి రూ.15 లక్షలు కొట్టేశాడు.

Odisha Cop's Son Loots Rs 15 Lakh From Bank Using Dad's Gun, Held
Odisha Cop Son : పోలీసు అధికారి కుమారుడు ఓ ప్రైవైటు బ్యాంకులో లూటీకి పాల్పడ్డాడు. తండ్రి సర్వీసు రివాల్వర్ తీసుకెళ్లి బ్యాంకు అధికారులను బెదిరించి రూ.15 లక్షలు కొట్టేశాడు. ఈ ఘటన ఒడిషాలోని సుందర్ గఢ్ జిల్లాకు జిల్లాలో యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో జరిగింది. బ్యాంకులో డబ్బులతో ఉడాయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. సుందర్ గఢ్ జిల్లాకు చెందిన సుందర్‌ఘఢ్ సదర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ కొడుకు జయ్‌దేవ్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
బ్యాంకులోకి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడు. కస్టమర్ మాదిరిగా కలరింగ్ ఇస్తూ క్యాషియర్ వద్దకు వెళ్లాడు. జేబులో నుంచి తుపాకీ తీసి క్యాషియర్ తలకు గురిపెట్టాడు. ఒక్కసారిగా క్యాషియర్ భయంతో కేకలు పెట్టాడు. వెంటనే బ్యాంకు మేనేజర్ లంకేశ్వర్ మహారాణా సహా ఇతర బ్యాంకు సిబ్బంది పరిగెత్తుకొచ్చారు. క్యాషియర్ తలపై గురిపెట్టిన నిందితుడు నాయక్.. బ్యాగులోకి నగదును నింపాలని బ్యాంకు మేనేజర్‌ను బెదిరించాడు. బ్యాగ్‌లో క్యాష్ నింపిన తర్వాత నిందితుడు బైక్‌పై పారిపోయాడు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు నాయక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిందితుడు నాయక్ కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో నిందితుడు జయదేవ్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. నాయక్ నుంచి నగదుతో పాటు పేలుడు పదార్ధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : Virat Kohli : విరాట్ కోహ్లి కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాద్ వాసి అరెస్ట్