Odisha Raids : రూ.2 కోట్లను పక్కింట్లోకి విసిరేసిన సబ్ కలెక్టర్‌ ..

రెండు కోట్ల రూపాయల నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి పక్కింటి టెర్రాస్ పైకి విసిరిశారు సబ్ కలెక్టర్. మైనింగ్ మాఫియాకు అడ్డుగోలుగా అనుమతులు ఇస్తు భారీ అవినీతికి పాల్పడుతు కోట్లు కూడబెట్టిన సొమ్మును పక్కింటిపైకి విసిరేశారు.

Odisha Raids : రూ.2 కోట్లను పక్కింట్లోకి విసిరేసిన సబ్ కలెక్టర్‌ ..

Odisha vigilance seizes Rs. 2 crore cash

Updated On : June 24, 2023 / 1:23 PM IST

Odisha vigilance Raids: అతని పేరు ప్రశాంత కుమార్ రౌత్‌. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. డబ్బుకు ఆశపడి భారీ అవినీతికి పాల్పడ్డారు. తీరా విజిలెన్స్ అధికారులు తనిఖీలు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఉన్న రెండు కోట్లకు పైగా డబ్బుని బాక్స్ లో పేర్చి ఆ డబ్బుని పక్కింట్లోకి విసిరేశారు. కానీ అధికారులు పక్కింటి డాబాపైకి విసిరిన డబ్బుల బాక్సుల్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసేశారు.

శుక్రవారం (జూన్ 23,2023)న విజినెన్స్ అధికారులు తొమ్మిది బృందాలుగా భువనేశ్వర్ లో దాడులకు దిగారు. దాంట్లో భాగంగానే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో నబరంగ్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ గా నిచేస్తున్న ప్రశాంత కుమార్ రౌత్ నివాసంపై కూడా దాడులకు దిగారు. ఆయన మైనింగ్ మాఫియాకు సహకరిస్తు స్టోన్ మైనింగ్ నిబంధనలు, విధివిధానాలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్ని తవ్వేసుకోవటానికి అనుమతులు అడ్డగోలుగా కట్టబెట్టారని తద్వారా భారీగా ఆస్తులు కూడాబెట్టారని సమాచారంతో తనిఖీలు చేపట్టారు.

Yoga On Moving Train : కదులుతున్న రైలుపై యోగా చేసిన విద్యార్ధులు .. అరెస్ట్ చేసిన పోలీసులు

దీంతో ప్రశాంత కుమార్ కంగారుపడిపోయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని బాక్సులో నింపేసి పక్కింటి టెర్రాస్ పైకి విసిరేశారు. కానీ అధికారులు అనుమానం వచ్చింది. పక్కింటి టెర్రాస్ పైకి ఎక్కి బాక్సుల్ని పరిశీలించారు. దాంట్లో నోట్ల కట్టలు బయటపడటంతో వాటిని తీసుకొచ్చి లెక్కించగా రూ.2 కోట్లు పైనే ఉందని గుర్తించారు. మొత్తం ఆరు బాక్సుల్లో ఉన్న రూ.500ల నోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇటీవల రెండు వేల నోట్లను బ్యాన్ చేయటంతో తన వద్ద ఉన్న డబ్బుని ప్రశాంత్ కుమార్ రౌత్ రూ.500 నోట్లుగా మార్పించినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

భువనేశ్వర్‌లోని ప్రశాంత కుమార్ నివాసం సహా మరో తొమ్మిది ప్రాంతాల్లోనూ ఒకేసారి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.ఈ తనిఖీల్లో మొత్తం రూ. 3 కోట్లకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా గతంలో కూడా ప్రశాంత్ కుమార్ రౌత్ అవినీతి ఆరోపణలో ఒకసారి అరెస్ట్ అయ్యారు. అయినా మళ్లీ అవినీతికి పాల్పడ్డారు. భారీగా అవినీతులకు పాల్పడుతు సొమ్ము కూడబెట్టి మరోసారి దొరికిపోయారు.

Tamilnadu : మొదటి మహిళా బస్సు డ్రైవర్‌ను అభినందించిన ఎంపీ కనిమొళి .. ఉద్యోగం నుంచి తీసివేసిన యాజమాన్యం