విజయనగరంలో సైబర్ కేటుగాడు చిక్కాడు..

విజయనగరంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది.. అతడో సైబర్ కేటుగాడు.. నిజాయితీగా డబ్బులు సంపాదించడం చేతకాలేదు.. ఈజీ మనీ కోసం అడ్డు దారులు తొక్కాడు.. సెక్స్ పేరుతో అందమైన అమ్మాయిల ఫొటోలను ఆన్ లైన్‌లో ఎరవేస్తాడు.. ఈ యువతి కావాలంటే డబ్బులు పంపండి.. ఆ తర్వాత ఎంజాయ్ చేయండి అంటూ ఆఫర్ ఇస్తాడు.. అతని మాటలు నమ్మి ఎంతోమంది ట్రాప్‌లో పడ్డారు.. లక్షలకు లక్షలు ముట్టచెబుతున్నారు..
ఇంతవరకు ఆ కేటుగాడు సంపాదించింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… మూడేళ్లుగా చీకిటి వ్యాపారం సాగుతోంది.. దాదాపు రూ.60 లక్షలు కాజేశాడు.. ఆన్ లైన్ మోసాలకు పాల్పడ్డాడు.. జమ్సద్‌పూర్‌కు చెందిన అశ్విన్ అనే వ్యక్తి 11 ఏళ్ల క్రితం విజయనగరం వచ్చి స్థిరపడ్డాడు.. అతడికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. తొలుత అశ్విన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు.. సింధు అనే యువతితో వివాహేతర సంబంధం నడిపిన అశ్విన్.. ఆన్ లైన్ సెక్స్ పేరిట మోసాలకు పాల్పడ్డారు. హానీ ట్రాప్‌లో 3 వేల మంది బాధితులు ఉన్నారు.
వెబ్‌సైట్‌తో పాటు లొకాంటో యాప్‌తో హనీట్రాప్ పాల్పడినట్టు తెలిపారు. తన వెబ్ సైట్లో అమ్మాయిల ఫొటోలు కావాలంటే నెంబర్ కు ఫోన్ చేయండి అంటూ ఆఫర్ చేస్తాడు.. యాప్ ద్వారా అశ్విన్, సింధు మాట్లాడుతూ అమ్మాయిల ఫొటోలను ఎరగా వేసి డబ్బులు వసూలు చేసేవారు.. రూ.500 నుంచి రూ. 10వేల వరకు వసూలు చేసేవాడు.. ఎదుటివారికి నమ్మకం కలగాలని సింధుతో మాట్లాడించేవాడు.. తనకు తెలిసిన అమ్మాయిలతో మాట్లాడించి వారిని ట్రాప్ చేసేవాడు.. ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు.
మరో నెంబర్ తో ఇలానే చేస్తూ ఇప్పటివరకూ మూడు వేల మందిని మోసం చేశాడు.. మూడేళ్లుగా చీకిటి దందాను నడుపుతూ లక్షల్లో సంపాదించాడు… అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ ఎన్ఆర్ఐ ఇదే తరహాలో మోసపోయాడు.. తనకు రూ.8వేల 500కు పంపాల్సి ఉండగా.. పొరపాటున రూ.80వేలకు పైగా పంపించాడు.. తాను పంపిన నగదును తిరిగి పంపమని అశ్విన్ ను కోరాడు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించిన ఎన్ఆర్ఐ పోలీసులను ఆశ్రయించడంతో ఈ సెక్స్ రాకెట్ గుట్టు వెలుగులోకి వచ్చింది.. రంగంలోకి దిగిన పోలీసులు అశ్విన్, సింధులను అదుపులోకి తీసుకున్నారు.